మహేష్-రాజమౌళి సినిమా.. తెరపైకి 2 టైటిల్స్?

మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి రోజుకో వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓవైపు ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో, మరోవైపు ఇలా ఊహాగానాలు కూడా అదే రేంజ్ లో వినిపిస్తున్నాయి. తాజాగా…

మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి రోజుకో వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓవైపు ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో, మరోవైపు ఇలా ఊహాగానాలు కూడా అదే రేంజ్ లో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 2 టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

మహేష్ సినిమాకు మహారాజా లేదా చక్రవర్తి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నాడట రాజమౌళి. చూడ్డానికి తెలుగు పదాల్లా అనిపించినప్పటికీ, ఈ రెండింటికీ పాన్ ఇండియా అప్పీల్ ఉంది. అయితే ఇవి కాకుండా ఇంకో టైటిల్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, మహేష్ మూవీని గ్లోబల్ రిలీజ్ చేయాలనుకుంటున్నాడు రాజమౌళి. కాబట్టి ఏ దేశంలో రిలీజైనా టైటిల్ తో ఇబ్బంది లేకుండా ఉండేలా సినిమాకు పేరు పెట్టాలనేది రాజమౌళి ఆలోచన.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా అమెరికన్ ఇండోనేషియన్ నటి ఛెల్సియా ఎలిజిబెత్ ను ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ స్థానంలో పీఎస్ వినోద్ ను తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. వీటికి అదనంగా ఇప్పుడు టైటిల్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. 

వీటన్నింటిపై క్లారిటీ ఇవ్వాలంటే రాజమౌళి మైక్ పట్టుకొని మీడియా ముందుకు రావాల్సిందే. త్వరలోనే ఆ ప్రెస్ మీట్ ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే వర్క్ పూర్తయింది.