ఉత్తరాంధ్రాలో అంతా పర్ఫెక్ట్… వైసీపీ జాబితా అదే!

ఉత్తరాంధ్రాలో చూస్తే మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో ఒకటి రెండు చోట్ల మార్పులు తప్ప అంతా పర్ఫెక్ట్ గానే 2019 నాటి జాబితానే రిలీజ్ చేశారు. పాత వారికీ సిట్టింగులకు జగన్ టికెట్లు తిరిగి…

ఉత్తరాంధ్రాలో చూస్తే మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో ఒకటి రెండు చోట్ల మార్పులు తప్ప అంతా పర్ఫెక్ట్ గానే 2019 నాటి జాబితానే రిలీజ్ చేశారు. పాత వారికీ సిట్టింగులకు జగన్ టికెట్లు తిరిగి ఇచ్చారు సిట్టింగుల మీద ఉన్న అసంతృప్తులను ఆయన ఎక్కడా పట్టించుకోలేదు. అదే టైం లో వారిని మార్చాలని గోల చేసిన వారి అభిప్రాయానన్ని పక్కన పెట్టేశారు.

శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం, పాతపట్నంలో రెడ్డి శాంతి, ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్ ల అభ్యర్ధిత్వాలు మారుతాయని అంతా అనుకున్నారు. కానీ చివరికి వారినే ఫైనల్ చేశారు. అలాగే విజయనగరంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడుకే తిరిగి టికెట్ ఇచ్చారు. ఇక్కడ మార్పు ఉంటుందనుకున్నా జగన్ మార్చలేదు.

విశాఖ జిల్లాలో లిస్ట్ అలాగే ఉంది. అయితే విశాఖ తూర్పులో గత అభ్యర్థిని మార్చి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ కి గాజువాక ఇచ్చారు. విశాఖ సౌత్ లో గత అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించడంతో ఆ సీటుని టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్ కి ఇచ్చారు.

పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్ధిని మారుస్తారు అని ప్రచారం జరిగినా అది కూడా అలాగే ఉంచారు. ఎలమంచిలిలో కన్నబాబు రాజు ప్లేస్ లో వేరే వారి పేర్లు వినిపించాయి. కానీ ఆ సీటు కూడా ఆయనకే ఇచ్చారు. భీమిలీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ని మారుస్తారు అని అనుకున్నా ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చారు. అయితే కొత్తగా వచ్చిన మార్పు ఏంటి అంటే అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ని మలసాల భరత్ కుమార్ అని కొత్త ముఖానికి ఇచ్చారు.

ఇవన్నీ చూస్తూంటే ఉత్తరాంధ్రాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా బాగానే పనిచేస్తున్నారు అని జగన్ భావిస్తున్నారు అనుకోవాలి. సర్వే నివేదికలు కూడా వారికి అనుకూలంగా వచ్చాయి అని భావించాలి. వైసీపీ రిలీజ్ చేసిన లిస్ట్ ని చూసినపుడు ఉత్తరాంధ్రాలో పెద్దగా వేలు పెట్టలేదు దాంతో సిట్టింగులు అంతా పర్ఫెక్ట్  అని పార్టీ భావిస్తోంది అని అర్ధం అయింది. వీరు రేపటి అభ్యర్ధులు జనాలు వీరి విషయంలో తీర్పు ఇచ్చి పర్ఫెక్ట్ అనుకుంటే మళ్ళీ అసెంబ్లీకి వస్తారు.