అనుష్క బయట కనిపించి చాన్నాళ్లయింది. తెలుగులో ఆమె ఓ సినిమా చేస్తున్నప్పటికీ ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా షూట్ చేస్తున్నారు. అంతెందుకు, తన గత చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్ టైమ్ లో కూడా అనుష్క బయటకు రాలేదు.
అనుష్క ఎందుకిలా తెరవెనక ఉండిపోతోందో అందరికీ తెలిసిందే. ఆమె కొన్నాళ్లుగా అధిక బరువు సమస్యతో బాధపడుతోంది. బరువు తగ్గడానికి ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆమధ్య 2-3 సార్లు బయటకొచ్చినప్పటికీ.. అనుష్క ఫిజిక్ పై చాలా విమర్శలు చెలరేగాయి. దీంతో ఆమె పూర్తిగా కనిపించడం మానేసింది.
ఎట్టకేలకు అనుష్క తాజా స్టిల్స్ బయటకొచ్చాయి. ఆశ్చర్యకరంగా ఆమె స్లిమ్ లుక్ లో కనిపించింది. సినిమాల్లో చూపించినట్టు ఇది గ్రాఫిక్స్ కాదు. నిజంగానే అనుష్క సన్నబడింది.
ఓ మలయాళం సినిమాకు అనుష్క ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ లో ఈరోజు జాయిన్ అయింది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా యూనిట్ ఆమెకు సాదరంగా స్వాగతం పలికిన ఫొటోలు బయటకొచ్చాయి. వాటిలో అనుష్క కాస్త సన్నబడినట్టు కనిపించింది. ఇది నిజంగా ఆమె అభిమానులు సంతోషపడే వార్తే.
అనుష్క సినిమాలు తగ్గించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ బరువు సమస్య. ఇప్పుడీ సమస్యను ఆమె అధిగమించినట్టే కనిపిస్తోంది. సో… రాబోయే రోజుల్లో ఆమె నుంచి మరిన్ని సినిమాలు ఆశించొచ్చు.