అంతా ముగిసిన తర్వాత లిరికల్ వీడియో

సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రయిలర్, లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తుంటారు. విడుదల తర్వాత డిలీటెడ్ సన్నివేశాలు, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లు, వీడియో సాంగ్స్ వదుల్తారు. కానీ గుంటూరుకారం విషయంలో దీనికి రివర్స్…

సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రయిలర్, లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తుంటారు. విడుదల తర్వాత డిలీటెడ్ సన్నివేశాలు, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లు, వీడియో సాంగ్స్ వదుల్తారు. కానీ గుంటూరుకారం విషయంలో దీనికి రివర్స్ లో జరుగుతోంది.

గుంటూరుకారం థియేటర్లలోకి వచ్చి చాలా రోజులైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దీని హవా తగ్గిపోయింది. ఇప్పుడీ సినిమా నుంచి లిరికల్ సాంగ్ విడుదల చేస్తున్నారు.

మీరు చదివింది నిజమే. అంతా ముగిసిన తర్వాత గుంటూరుకారం నుంచి ఫ్రెష్ గా లిరికల్ వీడియో వస్తోంది. ఈ శుక్రవారం గుంటూరుకారం ఏడో పాట లిరికల్ సాంగ్ వస్తోందని స్వయంగా తమన్ ప్రకటించాడు. అక్కడితో ఆగలేదు, ఈ పాట తనకు, మహేష్ బాబుకు ది బెస్ట్ సాంగ్ అని కూడా చెప్పుకొచ్చాడు.

అంతా అయిపోయిన తర్వాత లిరికల్ సాంగ్ ఏంటంటూ కామెంట్స్ పడుతున్నాయి. అంత బెస్ట్ సాంగ్ అనుకున్నప్పుడు సినిమాలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. అటు మహేష్ అభిమానులు మాత్రం సంబరపడుతున్నారు.

ఓవైపు ఈ సందడి ఇలా నడుస్తుంటే, మరోవైపు ఈ సినిమా టీవీల్లోకి రాబోతోంది. త్వరలోనే జెమినీ ఛానెల్ లో గుంటూరుకారం సినిమాను టెలికాస్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ ఛానెల్, హాయ్ నాన్న ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఆ సినిమా తర్వాత వచ్చేది గుంటూరు కారం సినిమానే.