అనకాపల్లి వైసీపీ ఖాతాలో?

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో మరోసారి గెలిచేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. అనకాపల్లి రాజకీయ చరిత్ర తీసుకుంటే ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవలేదు. ఇది గత పాతికేళ్ళుగా అనవాయితీగా వస్తోంది.…

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో మరోసారి గెలిచేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. అనకాపల్లి రాజకీయ చరిత్ర తీసుకుంటే ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవలేదు. ఇది గత పాతికేళ్ళుగా అనవాయితీగా వస్తోంది.

అనకాపల్లి నుంచి 1999లో గెలిచిన టీడీపీ 2004లో ఓడిపోయింది. 2004లో గెలిచిన కాంగ్రెస్ 2009లో ఓటమి పాలు అయింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిస్తే 2014లో తెలుగుదేశం గెలిచింది. 2019లో వైసీపీ గెలిచింది. ఇలా చూస్తే కనుక వరసగా రెండు సార్లు గెలిచిన సందర్భాలు అయితే పాతికేళ్ళుగా లేనే లేవు అంటున్నారు.

ఈ యాంటీ సెంటిమెంట్ తో వైసీపీ ఈసారి గెలవదు అని లెక్కలేస్తోంది ప్రత్యర్ధి పార్టీల శిబిరం. అయితే ఈసారి వైసీపీ కచ్చితంగా గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అనకాపల్లిలో ముందు అనుకున్న తీరుగా అయితే రాజకీయ ప్రతికూలత లేదని అంటున్నారు.

సామాజిక సమీకరణలు చూసుకున్నా తమకే అనుకూలిస్తున్నాయని భావిస్తున్నారు. మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు జనసేన తరఫున టికెట్ ఇచ్చారు. టీడీపీలో నిండా నిరాశ కమ్ముకుంది. కొణతాల అందరినీ ప్రసన్నం చేసుకుంటున్నారు కానీ ఎంతవరకూ ఆయనకు సహకరిస్తారు అన్నది అయితే తెలియడం లేదు అంటున్నారు.

దాంతో పాటు అంగబలం అర్ధబలం నిండుగా ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ టికెట్ ఇచ్చింది. దాంతో ఆ సామాజిక వర్గం ఓట్లు ఇపుడు ఈ సైడ్ టర్న్ అవుతున్నాయని అంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకాపల్లిలో నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అయింది.

దాంతో వైసీపీ ఆశలు రెట్టింపు అవుతున్నాయి అంటున్నారు. అనకాపల్లి మరోసారి తమ ఖాతాలో పడుతుంది అని దృఢమైన విశ్వాసాన్ని ఇపుడు వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు అంటే తెర వెనక సమీకరణలు కూడా కలసి వస్తున్నాయని అంటున్నారు.