చినబాబుకు తమ పార్టీ మంత్రిపేరు కూడా తెలియదా?

చినబాబు నారా లోకేష్ ను అందరూ పప్పు అని అంటుండే వారు. అలా అనడం తప్పు. ఎందుకంటే.. ఆయనే అందరూ తనను పప్పు అని పిలిచేందుకు అవకాశమిస్తూ అర్థ జ్ఞానంతో మాట్లాడడమూ, అవతకవకగా మాట్లాడడమూ…

చినబాబు నారా లోకేష్ ను అందరూ పప్పు అని అంటుండే వారు. అలా అనడం తప్పు. ఎందుకంటే.. ఆయనే అందరూ తనను పప్పు అని పిలిచేందుకు అవకాశమిస్తూ అర్థ జ్ఞానంతో మాట్లాడడమూ, అవతకవకగా మాట్లాడడమూ చేస్తుండేవారు.

ఇటీవలి కాలంలో ఆయన జ్ఞానం చాలా మెరుగుపడిందని, ఒక్కసారిగా జ్ఞాని అయిపోయారని.. సభల్లో చాలా బాగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ నాయకులు డప్పు కొట్టుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ చినబాబు నారా లోకేష్ కు తనతో పాటు సహచర మంత్రిగా పనిచేసిన సొంత పార్టీ సీనియర్ నాయకుడి పూర్తి పేరు కూడా తెలియదా? మరీ అంత అమాయకంగా అజ్ఞానంతో ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని, తండ్రి తర్వాత ముఖ్యమంత్రి అయిపోవాలని కలగంటున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.

నారా లోకేష్ ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో శంఖారావం సభ నిర్వహించారు. జగన్ కు సవాళ్లు విసరడమూ, విమర్శలు చేయడమూ ఇలాంటి రొటీన్ కామెడీని కాసేపు పండించారు. అయితే స్థానికంగా నాయకుల గురించి మాట్లాడుతూ… సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు గురించి పదేపదే ప్రస్తావించారు. ఇంత వరకు బాగానే ఉంది. సభల్లో స్థానికనేతల గురించి ప్రస్తావించి తీరాల్సిందే.

కానీ తనతో పాటు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నాయకుడి పేరు కూడా ఆయనకు పూర్తిగా తెలియదా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. ఆయన పేరు వచ్చినప్పుడెల్లా లోకేష్.. ‘కాలువ శ్రీనివాసరావు గారు’ అంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. సదరు నాయకుడి పేరు ‘కాలువ శ్రీనివాసులు’ మాత్రమే. ‘రావు’ అనే తోకను లోకేష్ జత చేసినట్టుగా ఉంది.

తమ సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులకు పేరు వెనుక తోక ఉండడం కద్దు. కాలువ కూడా అలా తమ సొంత కులానికి చెందిన నాయకుడు అని అనుకున్నారో లేదా.. ఇతర బీసీ కులాలకు చెందిన నాయకుల్ని కూడా తమ సొంత కులంగా భావించి వ్యవహరిస్తే తప్ప.. వారికి గౌరవం ఇవ్వకూడదని కంకణం కట్టుకున్నారో గానీ.. కాలువ పేరును ‘శ్రీనివాసరావు’ అంటూ పేర్కొనడాన్ని గమనించి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

ఒక విషయం సూటిగా చెప్పుకోవాల్సి వస్తే.. పార్టీలో నాయకుల పేర్ల విషయంలో చంద్రబాబుకు అపారమైన టేలెంట్ ఉందని ఎరిగిన వాళ్లు అంటారు. ఎంత కాలం తర్వాతనైనా చంద్రబాబు పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా పేరు పెట్టి పలకరిస్తారని.. అలా వారితో దగ్గరితనం చూపిస్తూ.. సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తారని అంటూ ఉంటారు. అలాంటి తండ్రికి.. కనీసం తన సహచర మంత్రి కూడా సరిగ్గా తెలుసుకోలేని లోకేష్ వారసుడుగా తయారయ్యాడని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఈ మాత్రం నాలెడ్జితో ఆయన చంద్రబాబు వారసుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఏమేర వెలగబెడతారో చూడాలి.