ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తయారవుతున్న సినిమా కల్కి. ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, సినిమా ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. మే నెల 9న ఈ సినిమా విడుదల కావాల్సి వుంది. ఇంకా రెండు నెలల సమయం వుంది. అందువల్ల కంఫర్టబుల్ గా విడుదల కావడానికి కావాల్సినంత సమయం అయితే వుంది.
కానీ ఫ్యాన్స్ కు ఇంకా ఎక్కడో చిన్న అనుమానం. టైమ్ కు వస్తుందా అని. ఎందుకంటే చాలా భారీ ప్రాజెక్ట్. పాన్ ఇండియా సినిమా. పైగా సినిమా మొత్తం సిజి వర్క్ తో నిండి వుంటుంది. అందుకే టైమ్ కు వస్తుందా అన్న సందేహం.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మే 9 డేట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని నిర్మాత అశ్వనీదత్ చూస్తున్నారు. సినిమా షూట్ మొత్తం అయిపోయింది. రెండో పార్ట్ షూట్ కూడా జరుగుతోంది. అయితే చివరిగా షూట్ చేసిన సన్నివేశాల సిజి పనులు మాత్రం పెండింగ్ వున్నాయి. చాలా వరకు సిజి ఫ్రేమ్ లు వచ్చేసాయి. చివరగా షూట్ చేసిన ఫుటేజ్ తాలూకా సిజి వర్క్ మాత్రం రావాల్సి వుంది.
ఆ సిజి ఫుటేజ్ రావాలి. అది సంతృప్తికరంగా వుండాలి. మళ్లీ మరోసారి కరెక్షన్స్ వుండకూడదు. అలా అయితే మే 9 కి విడుదల ఫిక్స్. కానీ సిజి లు రావడం ఏమాత్రం ఆలస్యమైనా, అప్ టు ది మార్క్ లేకపోయినా విడుదల కాస్త వెనక్కు జరిగే అవకాశం వుంది. ఇది 70:30 పర్సంట్ చాన్స్ అని తెలుస్తోంది. అంటే 70 పర్సంట్ మే 9నే రావడానికి చాన్స్ వుంది. 30 పర్సంట్ వాయిదాకు అవకాశం వుంది.