ఈరోజు శర్వానంద్ తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఓ కొత్త సినిమాను ప్రారంభించడంతో పాటు, మిగతా సినిమాల అప్ డేట్స్ ను కూడా పంచుకున్నాడు. ఈ సందర్భంగా మరో స్పెషల్ న్యూస్ కూడా బయటపెట్టాడు.
తన పుట్టినరోజు సందర్భంగా కూతురు పుట్టిన విషయాన్ని, పాప పేరును బయటపెట్టాడు శర్వానంద్.
శర్వానంద్, అతడి భార్య రక్షిత రీసెంట్ గా తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. రక్షిత పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని శర్వా, అధికారికంగా ప్రకటించలేదు. ఇన్నాళ్లకు తన పుట్టినరోజు సందర్భంగా పాప పేరును బయటపెట్టాడు.
తన పాపకు అచ్చతెలుగు పేరు పెట్టాడు. పాప పేరు లీలా దేవి. శర్వానంద్, రక్షిత పాపతో దిగిన ఫొటోను మీడియాకు రిలీజ్ చేశారు.
ఈరోజు శర్వానంద్ కొత్త సినిమా పేరు ఎనౌన్స్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న సినిమా మనమే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిజజీవితంలో తండ్రిగా మారిన శర్వానంద్, ఈ సినిమాలో కూడా తండ్రిగా కనిపించబోతున్నాడు.