అక్కా నీ ద‌రిద్రం శాశ్వ‌తంగా పోవ‌డానికి…!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఏదో ర‌కంగా వార్త‌ల్లో వుండాల‌ని త‌పిస్తుంటారు. ఏపీలో రాజ‌కీయంగా ఉనికి చాటుకోవాల‌నే ఆమె తాప‌త్ర‌యాన్నే త‌ప్పు ప‌ట్ట‌లేం. అయితే కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి దూకుడు, ఎందుక‌నో ఆ…

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఏదో ర‌కంగా వార్త‌ల్లో వుండాల‌ని త‌పిస్తుంటారు. ఏపీలో రాజ‌కీయంగా ఉనికి చాటుకోవాల‌నే ఆమె తాప‌త్ర‌యాన్నే త‌ప్పు ప‌ట్ట‌లేం. అయితే కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి దూకుడు, ఎందుక‌నో ఆ త‌ర్వాత క్ర‌మంగా త‌గ్గుతోంది. అడ‌పాద‌డ‌పా స‌భ‌లు నిర్వ‌హిస్తుండడం, ఆ వేదిక‌ల‌పై నుంచి త‌న అన్న‌, సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కానీ వాటికి ఎల్లో మీడియా సైతం పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ తానే అధికారంలోకి వ‌స్తాన‌ని, విశాఖ‌లో ప్ర‌మాణ స్వీకారం చేస్తానంటూ వైఎస్ జ‌గన్ కామెంట్స్ ష‌ర్మిల‌కి కోపం తెప్పించాయి. జ‌గ‌న్ స‌ర్కార్‌ను విమ‌ర్శిస్తూ ఫేస్‌బుక్‌లో ఆమె ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టు ఏంటంటే…

“పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం,భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా?”

ఆ పోస్టుపై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డడం గ‌మ‌నార్హం. అక్కా నీ ద‌రిద్రం ఏపీ నుంచి శాశ్వ‌తంగా పోవ‌డానికి ఎన్నిరోజులు ప‌డుతుంద‌ని ప్ర‌శ్నిస్తూ ఒక నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. అలాగే బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ షెడ్యూల్ మొద‌లు కావ‌డానికి మ‌ధ్య‌లో వ‌చ్చే గ్యాప్‌లో పొలిటిక‌ల్ షూట్‌కి వ‌చ్చావా జాలీ జోస‌ఫ్ శాస్త్రి అని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబునాయుడి ఊడిగం చేసేందుకు మీ క‌మిట్‌మెంట్ ఇంత‌నే? అని మ‌రొక నెటిజ‌న్ నిల‌దీశారు. ష‌ర్మిల పోస్టుపై కొంద‌రు ఘాటైన కామెంట్స్ పెట్టారు. అందులో కొన్ని…

“మీరు ఎంత బాగా న‌టించినా వ‌చ్చేది సున్నా” “మీరొక డ్రామా ఆర్టిస్ట్‌” “అందుకే తెలంగాణ‌లో త‌న్నారు”

“క‌రోనా క‌ష్ట‌కాలంలో రాష్ట్రానికి ఆదాయం లేక‌పోయినా సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించారు. దేశ‌మంతా ఆంధ్రా వైపు చూసేట్టు పాల‌న చేసిన జ‌గ‌న్ అన్న‌ను నువ్వు ఇలా అన‌డం, మీ ద‌త్త తండ్రి చంద్ర‌బాబునాయుడి స్క్రిప్ట్ చ‌ద‌వ‌డం చాలా విడ్డూరం”

“ఓక్కో కాస్త త‌గ్గు. మ‌రీ ఎక్కువైంది. ఏమ‌న్నా మాట్లాడితే ట్రోల్ చేస్తారంటావ్‌”

ఇలా ష‌ర్మిల‌పై అనేక మంది వ్య‌తిరేకంగా కామెంట్స్ చేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఏ ఒక్క‌రూ ఆమెకు మ‌ద్ద‌తుగా లేర‌నే విష‌యాన్ని ఈ పోస్టుపై వ‌చ్చిన కామెంట్స్‌ను చూసి అర్థం చేసుకోవ‌చ్చు.