హహ్హ‌హ్హ‌…తుస్సుమని గాలి తీసుకున్న ప‌వ‌న్‌!

జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ అజ్ఞానం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ప‌వ‌న్ గొప్ప‌త‌నం ఏంటంటే తన‌కు తానుగా ప‌రువు తీసుకుంటుంటారు. తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ అభాసుపాల‌య్యారు. అమాయ‌క‌త్వ‌మో, అజ్ఞాన‌మో తెలియ‌దు కానీ, ప‌వ‌న్ త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు మ‌రోసారి…

జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ అజ్ఞానం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ప‌వ‌న్ గొప్ప‌త‌నం ఏంటంటే తన‌కు తానుగా ప‌రువు తీసుకుంటుంటారు. తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ అభాసుపాల‌య్యారు. అమాయ‌క‌త్వ‌మో, అజ్ఞాన‌మో తెలియ‌దు కానీ, ప‌వ‌న్ త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు మ‌రోసారి బ‌ల‌మైన ఆయుధం ఇచ్చారు.

తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న త‌న సొంత పార్టీ శ్రేణుల్ని నిష్టూర‌మాడారు. సొంత వాళ్లే త‌న‌ను న‌మ్మ‌డం లేద‌ని వాపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో సొంత వాళ్ల‌కే న‌మ్మ‌కం క‌లిగించ‌ని ప‌వ‌న్‌, ఇక ఇత‌రులకు ఎలాంటి భ‌రోసా ఇస్తార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త‌న వాళ్ల‌కు కూడా అనుమానం క‌లిగించేలా రాజ‌కీయం చేస్తున్న ప‌వ‌న్‌ది త‌ప్పా లేక జ‌న‌సేన శ్రేణుల‌దా? అనే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది.

ఇవాళ ప‌వ‌న్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

“జ‌న‌సేన‌ను టీడీపీ బీ టీమ్ అని వైసీపీ వాళ్లు విమ‌ర్శిస్తే అర్థం చేసుకోవ‌చ్చు. బ‌య‌టి వాళ్లు అన‌డం వేరు. కానీ మ‌న‌వాళ్లు అన‌డం వేరు. బ‌య‌టి వాళ్ల‌కంటే జ‌న‌సేన నాయ‌కులే న‌మ్మ‌క‌పోవ‌డం చాలా ఇబ్బందిక‌రంగా వుంటుంది. మ‌న‌వాళ్లు న‌న్ను సందేహిస్తున్నారు. రాజ‌కీయాల్లో ప్ర‌లోభాలు వుంటాయ‌ని, వాటిని దాటుకోవ‌డమే నైతిక రాజ‌కీయం”  ప‌వ‌న్ అన్నారు.

ప‌వ‌న్ తాజా కామెంట్స్ ఇటు నెటిజ‌న్ల‌కు, అటు వైసీపీ కేడ‌ర్‌కు ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. చంద్ర‌బాబును సీఎం చేయ‌డానికే త‌మ నాయ‌కుడు ప‌ని చేస్తున్నార‌ని చివ‌రికి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా న‌మ్ముతున్నార‌ని ప‌వ‌న్ మాట‌లే చెబుతున్నాయ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప‌దేళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో చివ‌రికి త‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు కూడా న‌మ్మ‌కం క‌లిగించ‌ని ప‌వ‌న్‌… ఇంత‌కాలం ఎవ‌రి కోసం? ఎందుకోసం ప‌ని చేశారో జ‌వాబు చెప్పాల్సిన అవ‌స‌రం వుంద‌ని అంటున్నారు. మొత్తానికి త‌న రాజ‌కీయ పంథాను జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లే అనుమానిస్తున్న వాస్త‌వాన్ని ప‌వ‌నే బ‌య‌ట పెట్ట‌డం విశేషం అంటున్నారు.