ఆ మీడియాధిపతి చంద్రబాబునాయుడి భక్తుడు. చంద్రబాబునాయుడి కోసం దిగంబరంగా నృత్యం చేస్తున్నారు. పాఠకులు నవ్వుతారనే వెరపు కూడా లేకుండా తన పత్రికలో కథనాలు రాయిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలనే ఆత్రుతలో విచక్షణ కోల్పోయి రాతలు రాయిస్తున్నారు.
జర్నలిజంలో ఆయన నగ్నత్వం ముందు.. సినిమాల్లో సమంత (పుష్పలో ఊ అంటావా, ఊహూ అంటావా పాట), నీలి చిత్రాల్లో షకీల ఎక్స్‌పోజింగ్ దిగదుడుపే అనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు ప్రఃభుత్వ, పార్టీ పదవుల్లో అగ్రస్థానం కల్పించిన నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసలు అందుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా కేబినెట్‌లో స్థానం కల్పించని వైనం తెలిసిందే. అధికారం నుంచి దిగిపోతున్న సమయంలో ఎమ్మెల్సీ ఫరూక్‌కు చోటు ఇచ్చినా ఫలితం లేకపోయింది.
తాజాగా అభ్యర్థుల ఎంపిక క్రమంలో అటూఇటూ రాజకీయ వలసలు జరుగుతున్నాయి. అయితే కర్నూలు ఎంపీ, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఎస్.సంజీవ్‌కుమార్‌కు సమీకరణల్లో భాగంగా వైసీపీ సీటు ఇవ్వడం లేదు. మరో బీసీ నాయకుడు, మంత్రి గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీ సీటు ఖరారు చేశారు. అలాగని పద్మశాలీలను ఆయన విస్మరించలేదు.
అదే జిల్లాలో ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టి, పద్మశాలికి చెందిన మాచని వెంకటేశ్‌కు టికెట్ ఖరారు చేశారు. ఇదీ జగన్ కమిట్‌మెంట్. ఇలాంటివేవీ వారాంతపు పలుకుల జర్నలిస్ట్, మీడియాధిపతికి కనిపించవు. బీసీల్లో వైసీపీపై వ్యతిరేకత సృష్టించి, తద్వారా తన సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును సీఎం చేసుకోవాలని తపన పడుతున్నారు.
ఇదే వారాంతపు పలుకుల సార్ కేశినేని వైసీపీలో చేరుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత కాలం కేశినేని తన కులపోడని, అగ్రవర్ణ నేత అని గుర్తించకపోవడం… ఎల్లో మీడియా కుల పిచ్చికి నిదర్శనం. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు జగన్ వెన్నుపోటు పొడుస్తున్నాడని తెగ బాధపడిపోతూ లాజిక్ లేని కథనాలు రాస్తున్న వారాంతపు జర్నలిస్టు… బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడిని సీఎం చేస్తామని చంద్రబాబుతో హామీ ఇప్పించగలరా? అలాగే జగన్ కంటే ఎక్కువ సీట్లు ఆయా సామాజిక వర్గాలకు కేటాయించేలా చేస్తామని ప్రకటించే దమ్ము, ధైర్యం వుందా? అనే ప్రశ్న ఎదురవుతోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సిట్టింగ్‌లనే జగన్ బలి చేస్తున్నారని మొసలి కన్నీళ్లు కారుస్తున్న ఎల్లో మీడియా… వాళ్లందరినీ రాష్ట్ర, జాతీయ స్థాయి చట్టసభలకు పంపి, గౌరవించారని పరోక్షంగా అయినా అంగీకరించినట్టైంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టినట్టు వైసీపీ వాదిస్తోంది. గతం కంటే ఒకట్రెండు సీట్లు ఎస్సీ, బీసీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు జగన్ ఇస్తారే తప్ప, ఏ కులానికి తక్కువ చేయరని ప్రతిపక్షాలకు తెలుసు. అసలు కసరత్తు అంతా దాని కోసమే అని విస్మరిస్తే ఎలా?
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల పేరుతో వారాంతపు పలుకుల సార్ ఏడుపంతా తన సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కోసమే అని పాఠకులు, వీక్షకులకు తెలియంది కాదు. జర్నలిజం ముసుగులో దిగంబరంగా వారాంతపు పలుకుల జర్నలిస్టు చేసే నగ్న నృత్యాన్ని చూసి, క్రికెట్‌లో చీర్ గర్ల్స్, సినిమాల్లో సెక్సీ యాక్టర్స్ గుర్తొస్తున్నారు. బహుశా వాళ్ల ఎక్సోపోజింగే నయమనే భావన కలుగుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.