గత కొన్ని రోజులుగా పచ్చ మీడియాలో తెగ యాగీ. జగన్ కేవలం ఎస్సీల టికెట్లు మాత్రమే తెగ్గొట్టేస్తున్నారు అంటూ. నిజానికి ఎవరి పార్టీ వాళ్లది. ఎవరికి టికెట్ ఇచ్చుకోవాలో వాళ్ల ఇష్టం. రేపు చంద్రబాబు అయినా సరే. కెేశినేని నానికి ఎందుకు ఇవ్వలేదు అంటే అది ఆయన ఇష్టం.
ఎస్సీ నియోజకవర్గాల్లో టికెట్లు మారుస్తున్నారు జగన్. కానీ అంత మాత్రం చేత ఎస్సీ నియోజక వర్గాల్లో బిసిలనో, అగ్రవర్ణాలనో తీసుకోవచ్చి కూర్చో పెట్టడం లేదు కదా? మరో ఎస్సీ కే కదా టికెట్ ఇచ్చేది. మరి ఎస్సీలకు అన్యాయం ఎలా అవుతుంది? మహా అయితే టికెట్ దొరకని అభ్యర్ధికి అన్యాయం అవుతుంది. కానీ దీన్ని భూతద్దంలో చూపించి, ఎస్సీలకు అన్యాయం జరిగిపోతోందో అంటూ నానా గోల చేస్తూ వస్తున్నారు.
ఇదిలా వుంటే పాయకరావు పేటలో టికెట్ ఇవ్వలేదు గొల్ల బాబూరావుకు. మరి ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపిస్తున్నారు. మరి ఇప్పుడు ఎస్సీలకు అద్భుతమైన న్యాయం చేసారు జగన్ అని రాయాలి కదా ఇదే పచ్చ మీడియా?
బదిలీ కాదు, ఊస్టింగ్ కాదు. ప్రమోషన్ కదా? పైసా ఖర్చు లేకుండా ఎంపీ అయిపోతున్నారు. అదృష్టమే కదా. ఆ అదృష్టం పట్టించింది జగనే కదా. అలాంటపుడు ఎస్సీలకు అదృష్టం పట్టించిన జగన్ అని రాయాలి కదా?
జగన్ కు ధైర్యం వుంది. ఇన్ని నెలలు ముందుగా టికెట్ లు అనౌన్స్ చేస్తున్నారు. అదీ ఖలేజా అంటే. చంద్రబాబు కనీసం రెండు వారాలు ముందుగా అయినా ఆ పని చేయగలరా? పవన్ కళ్యాణ్ కనీసం తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ముందుగా చెప్పగలరా? కానీ ఎల్లో మీడియా వారి బలహీనతలను మాత్రం తన అక్షరాల మాటున కప్పిపెడుతూ వస్తుంది. గతంలోనూ ఇంతే.. ఇప్పుడూ అంతే.