టైటిల్ సాంగ్ కంటే కిక్కిచ్చిన మేటర్ ఇది

మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా సర్కారువారి పాట. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్ రిలీజైంది. మహేష్ బాబు లాంటి హీరో నటిస్తున్న సినిమా నుంచి టైటిల్ సాంగ్ వస్తుందంటే, అంచనాలు-ఎదురుచూపులు ఓ…

మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా సర్కారువారి పాట. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్ రిలీజైంది. మహేష్ బాబు లాంటి హీరో నటిస్తున్న సినిమా నుంచి టైటిల్ సాంగ్ వస్తుందంటే, అంచనాలు-ఎదురుచూపులు ఓ రేంజ్ లో ఉంటాయి. సర్కారువారిపాట టైటిల్ సాంగ్ పై కూడా అదే విధంగా ఉన్నాయి. కాకపోతే ఈసారి అంతకంటే కిక్కిచ్చే మేటర్ ఒకటి బయటకొచ్చింది.

సర్కారువారి పాట షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్‌ లోని ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్‌ లపై  మాస్ సాంగ్ ని చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణ పూర్తయింది. దాంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇది ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.

ఎందుకంటే, సర్కారువారి పాట సినిమా షూటింగ్ పూర్తవ్వడం లేదని, రీషూట్లు జరుగుతున్నాయని, దీంతో చెప్పిన తేదీకి సినిమా రాదంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఓవైపు లిరికల్ వీడియోస్ వస్తున్నప్పటికీ, మరోవైపు సినిమా రిలీజ్ పై అనుమానాలు అలానే కొనసాగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇటు టైటిల్ సాంగ్ రిలీజ్ అవ్వడం, అటు సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారనే న్యూస్ బయటకురావడం ఒకేసారి జరిగాయి.

దీంతో టైటిల్ సాంగ్ కంటే, షూటింగ్ పూర్తయిందనే మేటరే మహేష్ అభిమానులకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది. వచ్చేనెల 12న సినిమా తప్పనిసరిగా థియేర్లలోకి వస్తుందనే నమ్మకం కుదరడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రశాంతంగా టైటిల్ సాంగ్ వింటున్నారు.