బాబును వెంటాడుతున్న ఓటుకు నోటు కేసు..!

చంద్ర‌బాబునాయుడిని ఓటుకు నోటు కేసు నీడ‌లా వెంటాడుతోంది. 2015లో కేసీఆర్ స‌ర్కార్‌ను ప‌డ‌గొట్టేందుకు చంద్ర‌బాబు కుట్ర‌ల‌కు తెర‌లేపార‌నే విమ‌ర్శ వుంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్ర‌బాబు తెర‌లేపారు. అప్ప‌ట్లో ఇప్ప‌టి…

చంద్ర‌బాబునాయుడిని ఓటుకు నోటు కేసు నీడ‌లా వెంటాడుతోంది. 2015లో కేసీఆర్ స‌ర్కార్‌ను ప‌డ‌గొట్టేందుకు చంద్ర‌బాబు కుట్ర‌ల‌కు తెర‌లేపార‌నే విమ‌ర్శ వుంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్ర‌బాబు తెర‌లేపారు. అప్ప‌ట్లో ఇప్ప‌టి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీడీపీలో కీల‌క పాత్ర పోషించేవారు. రేవంత్‌ను అడ్డం పెట్టుకుని నాటి సీఎం కేసీఆర్ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేయ‌బోయి, చంద్ర‌బాబు ఇరుక్కున్నారు.

నాడు రేవంత్‌రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుపాలు చేశారు. ఇదే కేసులో స్టీఫెన్‌స‌న్‌తో చంద్ర‌బాబు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ …”మ‌నోళ్లు బ్రీప్డ్ మీ” అనడం, ఆ వాయిస్ టీడీపీ అధినేత‌దే అని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్ర‌బాబునాయుడిని నిందితుడిగా చేర్చాల‌ని, అలాగే కేసు విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించాల‌న్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వేర్వేరు పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

ఈ కేసులో నిందితుడైన వ్య‌క్తే నేడు ముఖ్య‌మంత్రి స్థానంలో వుండ‌డంతో విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించాల‌న్న విజ్ఞప్తిలో స‌మంజ‌సం వుంది. ఈ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ సురేంద‌రేష్‌, జ‌స్టిస్ ఎస్వీఎన్ భ‌ట్టి ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

రెండు పిటిష‌న్లు ప్రాధాన్యం సంత‌రించుకోవ‌డం, మ‌రోవైపు సుప్రీంకోర్టు నిర్ణ‌యం ఎలా వుంటుందో అనే ఉత్కంఠ‌కు తెర‌లేచింది. టీడీపీతో పాటు అన్ని రాజ‌కీయ ప‌క్షాలు సుప్రీంకోర్టు విచార‌ణ వైపు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.