2 రోజులకు 18 కోట్లు.. 3 రోజులకు బ్రేక్-ఈవెన్?

మొదటి రోజు మొదటి ఆటకే మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఉప్పెన వసూళ్లు మాత్రం టైటిల్ కు తగ్గట్టు ఉప్పెనలా వెల్లువెత్తున్నాయి. భారీ హైప్ కారణంగా మొదటి రోజే 9 కోట్ల 30 లక్షల…

మొదటి రోజు మొదటి ఆటకే మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఉప్పెన వసూళ్లు మాత్రం టైటిల్ కు తగ్గట్టు ఉప్పెనలా వెల్లువెత్తున్నాయి. భారీ హైప్ కారణంగా మొదటి రోజే 9 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ (తెలుగు రాష్ట్రాల్లో) రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది.

విడుదలైన 2 రోజుల్లో ఉప్పెన సినిమాకు వరల్డ్ వైడ్ 18 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచే 2 రోజుల్లో 16 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ సాధించినట్టు వెల్లడించింది.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే.. వీకెండ్ గడిచేసరికి (3 రోజులుకే) చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది. ఉప్పెనకు మరో సినిమా నుంచి పోటీ లేకపోవడంతో.. వీక్ డేస్ లో కూడా వసూళ్లు భారీగా వచ్చే సూచనలున్నాయి. ఏపీ,నైజాంలో ఈ సినిమాకు 2 రోజుల్లో వచ్చిన షేర్లు (కోట్లలో) ఇలా ఉన్నాయి.

నైజాం – 5.75
ఉత్తరాంధ్ర – 2.67
ఈస్ట్ – 1.63
వెస్ట్ – 1.13
కృష్ణా – 1.10
గుంటూరు – 1.42
సీడెడ్ – 2.45
నెల్లూరు – 0.58

ఆ విధంగా చంద్రబాబు ధీరుడు

ప్ర‌తి ఒక్క‌రూ జ‌గ‌న్ పాల‌న‌లో ల‌బ్ధిదారులే