లింగుస్వామి గుర్తున్నారా? తమిళ దర్శకుడు. విశాల్ తో మాంచి యాక్షన్ సినిమాలు తీసినవాడు. అల్లు అర్జున్ తో ద్విభాషా సినిమాకు ఓపెనింగ్ చేయించిన డైరక్టర్. ఆ తరువాత వార్తల్లోంచి గాయబ్.
తమిళంలో కాదు, తెలుగులో కాదు, ఎక్కడా చాన్స్ ఇచ్చిన వారు లేరు. ఆఖరికి ఇప్పుడు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఉస్తాద్ రామ్ హీరోగా లింగుస్వామి డైరక్షన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.
రామ్ కూ ఇదే కావాలి. భారీ యాక్షన్ ఎపిసోడ్ లు, హీరోయిజం ఎలివేషన్లు పుష్కలంగా వుంటాయి లింగుస్వామి సినిమాల్లో. అందుకే సరైన కథ దొరికితే లింగుస్వామి చెలరేగిపోతారనే నమ్మకంతో సై అని వుండొచ్చు
కథ సంగతి తాము చూసుకుని, టేకంగ్ లింగుస్వామికి వదిలేస్తారేమో? బహుశా త్వరలో ఈ కాంబినేషన్ వార్త అఫీషియల్ గా రావొచ్చు.