నేను ఆ టైపు కాదంటున్న ప్రభాస్

హీరోయిన్: నువ్వు రోమియో అనుకుంటున్నావా..? Advertisement హీరో: ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైపు కాదు. వాలంటైన్స్ డే కానుకగా వచ్చిన రాధేశ్యామ్ గ్లింప్స్ లో ప్రభాస్ డైలాగ్ ఇది.…

హీరోయిన్: నువ్వు రోమియో అనుకుంటున్నావా..?

హీరో: ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైపు కాదు.

వాలంటైన్స్ డే కానుకగా వచ్చిన రాధేశ్యామ్ గ్లింప్స్ లో ప్రభాస్ డైలాగ్ ఇది. 52 సెకెన్ల నిడివి కలిగిన ఈ టీజర్ లో ప్రేమికుడిగా ప్రభాస్ ను, అతడి ప్రేయసిగా పూజా హెగ్డేను అందంగా ప్రజెంట్ చేశారు.

పూర్తిగా వింటేజ్ యూరోప్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారనే విషయం గ్లింప్స్ చూస్తే అర్థమౌతోంది. గ్లింప్స్ లో లవర్ బాయ్ గా ప్రభాస్ లుక్స్ బాగున్నాయి. సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే కనిపించబోతున్నారు.

ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. జులై 30న రాధేశ్యామ్ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. సౌత్ లో అన్ని భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా… హిందీ వెర్షన్ కు మిధున్-మనన్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా భాగ్యశ్రీ కనిపించనుంది. చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ ఇదే.