ఈసారి ఆ హీరోయిన్ కు అవార్డ్ పక్కా అంట!

పుష్కర కాలానికి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది శ్రియ. కానీ ఆమె నుంచి అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ను మాత్రం ఆడియన్స్ చూడలేదు. ఎట్టకేలకు ఆ ముచ్చట తీరబోతోందంటున్నారు టాలీవుడ్ జనాలు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న…

పుష్కర కాలానికి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది శ్రియ. కానీ ఆమె నుంచి అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ను మాత్రం ఆడియన్స్ చూడలేదు. ఎట్టకేలకు ఆ ముచ్చట తీరబోతోందంటున్నారు టాలీవుడ్ జనాలు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న గమనం సినిమాతో శ్రియకు అవార్డులు రావడం ఖాయం అంటున్నారు.

మూడు కథల సమాహారంగా తెరకెక్కిన గమనంలో చెవిటి మహిళగా నటించింది శ్రియ. ఆమెకు ఓ చిన్నారి కూడా ఉంటుంది. తనను వదిలేసి వెళ్లిపోయిన భర్త కోసం ఎదురుచూస్తూ, పాపను చూసుకుంటూ, పేదరికాన్ని అనుభవించే మహిళ పాత్ర ఇది.

ఈ పాత్రలో శ్రియ జీవించేసిందట. ఆమె కెరీర్ లోనే బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చిందనేది ఇన్ సైడ్ టాక్. ఇన్నాళ్లూ గ్లామర్ డోస్ లో శ్రియను చూసిన జనాలంతా, గమనంలో ఆమె నటన కూడా మెచ్చుకుంటారని చెబుతున్నారు.

నిజానికి గతంలోనే పాత్రల పరంగా కొన్ని ప్రయోగాలు చేసింది శ్రియ. పవిత్ర, మిడ్ నైట్స్ చిల్డ్రన్ లాంటి సినిమాలు చేసింది. అయితే వాటితో పోలిస్తే ఆమె పోషించిన తాజా బధిర మహిళ పాత్ర శ్రియకు మంచి పేరు తీసుకొస్తుందని చెబుతున్నారు. 

ఆ విధంగా చంద్రబాబు ధీరుడు 

ప్ర‌తి ఒక్క‌రూ జ‌గ‌న్ పాల‌న‌లో ల‌బ్ధిదారులే