హీరోయిన్లను, పెళ్లి పుకార్లను విడదీసి చూడలేం. ఎప్పటికప్పుడు వాళ్ల ఎఫైర్లు, పెళ్లిళ్లపై పుకార్లు వస్తూనే ఉంటాయి. వాటిని నిజం చేస్తూ కొంతమంది సీక్రెట్ గా పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. ఇప్పుడు మెహ్రీన్ వంతు వచ్చింది. 'హనీ ఈజ్ ద బెస్ట్' అంటూ ఎఫ్2 సినిమాతో అందర్నీ ఎంటర్ టైన్ చేసిన మెహ్రీన్ పై పెళ్లి పుకార్లు ఊపందుకున్నాయి.
హర్యాణ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్యతో మెహ్రీన్ కు పెళ్లి సెట్ అయిందట. పెళ్లి కొడుకు భవ్య బిష్ణోయ్ తండ్రి కుల్దీప్, ప్రస్తుతం అదంపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. మరో నెల రోజుల్లో అంటే వచ్చేనెల 13న వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా జరగబోతోందట. రాజస్థాన్ లోని జైపూర్ లో ఈ నిశ్చితార్థం ఉంటుందట.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది మెహ్రీన్. ప్రస్తుతం ఆమె ఎఫ్3 సినిమాలో నటిస్తోంది. ఇలా కెరీర్ పీక్ లో ఉన్న టైమ్ లో మెహ్రీన్ పై పెళ్లి పుకార్లు రావడం ఆశ్చర్యం. తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై మెహ్రీన్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు.
కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది మెహ్రీన్. ఆ సినిమా వచ్చి రీసెంట్ గా ఐదేళ్లు పూర్తయింది. ఈ ఐదేళ్లలో తెలుగు-తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.