జై జగన్.. జై జై నిమ్మగడ్డ

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల కోసం ఈ స్థాయిలో పట్టుబట్టకపోయి ఉంటే, వైసీపీ ఇంకా ఎన్నికలపై మీనమేషాలు లెక్కిస్తూ నిమ్మగడ్డ ఉన్నన్ని రోజులు ఎన్నికలకు వెళ్లేది లేదని వెనకడుగు వేస్తూనే ఉండేది. కచ్చితంగా…

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల కోసం ఈ స్థాయిలో పట్టుబట్టకపోయి ఉంటే, వైసీపీ ఇంకా ఎన్నికలపై మీనమేషాలు లెక్కిస్తూ నిమ్మగడ్డ ఉన్నన్ని రోజులు ఎన్నికలకు వెళ్లేది లేదని వెనకడుగు వేస్తూనే ఉండేది. కచ్చితంగా వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొని ఉండేది. కానీ ఇప్పుడు రెండు దశల పంచాయతీ ఎన్నికలతో వైసీపీ ఫుల్ జోష్ లోకి వచ్చేసింది. పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. పంచాయతీల్లో 80 శాతానికి పైగా క్లీన్ స్వీప్ చేయడం ఆ పార్టీకి, నాయకులకు సంతోషాన్నిచ్చింది.

ఈ ఎన్నికల ద్వారా క్లారిటీ వచ్చిన మరో విషయం ఏంటంటే.. టీడీపీకి స్థానికంగా అభ్యర్థులే లేకపోవడం. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలు మినహా మిగతా చోట్ల జరిగిన పోరాటం అంతా వైసీపీ వర్సెస్ వైసీపీ. అలాగని వైసీపీలో విభేదాలున్నాయనుకుంటే పొరపాటే.. పార్టీపై స్థానికంగా పట్టు నిలుపుకునేందుకు రెండు వర్గాలు తమ బలప్రదర్శన చేశాయంతే. ఈ బలప్రదర్శనల్లో టీడీపీది కేవలం ప్రేక్షక పాత్ర.

టీడీపీ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట మాత్రమే ఆ పార్టీకి అరకొర సీట్లు వచ్చాయి. మిగతా చోట్ల కనీసం టీడీపీ బలపరచినా, డబ్బులిస్తామన్నా, పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. తొలి దశలో కాస్తో కూస్తో ఆపసోపాలు పడ్డా, రెండో దశ వచ్చే సరికి టీడీపీ పూర్తిగా శవాసనం వేసేసింది.

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీదే హవా. దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పనైంది. ఇంకా చెప్పాలంటే తొలి దశ కంటే రెండో దశలో వైసీపీకి మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈ లెక్కన మిగతా దశల్లో క్లీన్ స్వీప్ ఖాయంగా కనిపిస్తోంది. ఒకరకంగా ఇదందా నిమ్మగడ్డ చలవేననేది వైసీపీ నాయకుల అంతర్గత అభిప్రాయం.

జై జగన్.. జై జై నిమ్మగడ్డ..

నిమ్మగడ్డ వల్లే ఎన్నికలొచ్చాయి, నిమ్మగడ్డ వల్లే తమ టాలెంట్ బయటపడిందనేది వైసీపీ విజేతల అభిప్రాయం. పంచాయతీల్లోనే ఇలా ఉంటే.. రేపో మాపో మొదలు కాబోతున్నట్టు సంకేతాలున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ పోరులో వైసీపీ ఘన విజయానికి అడ్డే ఉండదనేతి ఆ పార్టీ నేతల అభిప్రాయం. 

అందులోనూ నిమ్మగడ్డ తొలిసారి ప్రభుత్వం చెప్పిన మాట విని.. మిగిలిన ఎన్నికలను కూడా ఇదే ఊపులో జరిపేసే ఉద్దేశంలో ఉన్నారట. అటు ప్రభుత్వం కూడా మొండి పట్టుదలకు పోకుండా కోడ్ లో కోడ్.. అంతా ఒకేసారి ముగించేసి అభివృద్ధి పనులపై ఫోకస్ పెడతామనే ఆలోచనలో ఉంది.

అంటే మరో నెల రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల సందడి ఉంటుందనమాట. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల్లో గత షెడ్యూల్ ప్రకారం ఏకగ్రీవాల సంఖ్యతో వైసీపీ సత్తా చాటింది. నిమ్మగడ్డ వ్యవహారం తెలిశాక, పరిస్థితి ఎలా తారుమారవుతుందో అని అనుకున్నారంతా. అయితే ఎస్ఈసీ స్థానంలో ఎవరు ఉన్నా, వారు ఎలాంటి ఆంక్షలు విధించినా.. చివరకు ప్రజాబలం వైసీపీకే ఉందని పంచాయతీ రెండు దశల ఎన్నికలతో రుజువు అయింది.

అంటే మిగిలిన దశలతో పాటు.. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరులో కూడా వైసీపీ విజయానికి ఎవరూ అడ్డుపడలేరనే విషయం కూడా అర్థమవుతోంది. ఎన్నికలతో టీడీపీ ఎంత బలహీనంగా ఉందనే విషయం కూడా వైసీపీకి మరింత సంతోషాన్నిస్తోంది. దీనంతటికీ కారణం అయిన నిమ్మగడ్డను వైసీపీ శ్రేణులు అభినందిస్తున్నాయి.

ఆ విధంగా చంద్రబాబు ధీరుడు

ప్ర‌తి ఒక్క‌రూ జ‌గ‌న్ పాల‌న‌లో ల‌బ్ధిదారులే