నాగ్ చైతన్య-విక్రమ్ కే కుమార్-దిల్ రాజు కాంబినేషన్ అంటే అది చిన్న సినిమా ఎందుకవుతుంది. పెద్ద సినిమానే అవుతుంది. అలాంటి పెద్ద సినిమాను విడుదల చేయకుండా ఎందుకు పక్కన పెట్టినట్లు?
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్ 3 ఇలా పెద్ద సినిమాలు అన్నీ లైన్ లో వున్నాయి. అందుకే చిన్న, మీడియం సినిమాలు అన్నీ జూన్, జూలై నెలల్లో డేట్లు వెదుక్కుని వెళ్లిపోయాయి.
కానీ థాంక్యూ సినిమా విషయం లో మాత్రం ఏ హడావుడీ లేదు. పైగా ఈ సినిమా పూర్తి చేసుకుని, అదే హీరో, అదే డైరక్టర్ కలిసి వెబ్ సిరీస్ మీదకు వెళ్లిపోయారు. దాంతో పాటే హీరో చైతన్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. మరి థాంక్యూకు మాత్రం ఎందుకు డేట్ అనౌన్స్ చేయడం లేదు?
జూన్ లేదా జూలై, లేదా ఆగస్టు నెలల్లో డేట్ వేసుకోవచ్చు. హడావుడి మొదలు పెట్టొచ్చు. కానీ ఆ దిశగా యూనిట్ ఆలోచనలు చేస్తున్నట్లు లేదు. ఇప్పటి నుంచి హడావుడి చేసినా వృధా, సరైన డేట్ పడిన తరువాత మొదలు పెట్టొచ్చు అనే ఆలోచనలో వున్నారేమో మరి?
మొత్తానికి ఓ పెద్ద ప్రాజెక్టు ఫస్ట్ కాపీ రెడీ అయిపోయినా కూడా అలా పక్కన పడి వుండడం కాస్త ఆశ్చర్యకరమే. ఇంకా రెడీ అవుతూనే వున్న ఎఫ్ 3 మాత్రం అదే నిర్మాత నుంచి ముందుగా బయటకు వస్తోంది.