రామ్ చరణ్- శంకర్- దిల్ రాజు కాంబినేషన్లో నిర్మాణమవుతున్న సినిమా గేమ్ ఛేంజర్. చిరకాలంగా సెట్ మీద వున్న ఈ సినిమా ఇప్పుడు విడుదల దిశగా పయనిస్తోంది. హీరో రామ్ చరణ్ షూట్ పార్ట్ పూర్తయింది. మిగిలిన పార్ట్ కొద్దిగా వుంది. జూలై రెండో వారం తరువాత దర్శకుడు శంకర్ పూర్తిగా ఈ సినిమా మీదే వుంటారు. సినిమాను దీపావళికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నిర్మాత దిల్ రాజు ‘గ్రేట్ ఆంధ్ర’ కు తెలిపారు.
గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ కోసం కాల్ చేయగా, అటు తమిళంలో కానీ, ఇటు తెలుగులో కానీ దీపావళికి సరైన సినిమా లేదని, అందుకే గేమ్ ఛేంజర్ ను ఎలాగైనా దీపావళికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దర్శకుడు శంకర్ వచ్చేనెల రెండో వారం నుంచి టచ్ లోకి వస్తారని, అప్పుడు ఈ విషయంలో పూర్తి క్లారిటీ వస్తుందని అన్నారు.
రెగ్యులర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తప్ప, మరేమీ పెద్దగా బ్యాలన్స్ లేదన్నారు. సిజి కంటెంట్ అంతా ఎప్పుడో రెడీగా వుందని చెప్పారు. దర్శకుడు శంకర్ తో మాట్లాడిన తరువాత డేట్ అనౌన్స్ మెంట్, కొత్త కంటెంట్ విడుదల వుంటుందన్నారు. దీపావళికి రాలేకపోతే, క్రిస్మస్ కు రావడం పక్కా అని దిల్ రాజు వెల్లడించారు. ఏది ఏమైనా ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్ విడుదల వుంటుందన్నారు.