యానిమల్ సాంగ్.. భావోద్వేగాలకు పెద్ద పీట

ఈ ఏడాది చివరిలో రాబోయే సినిమాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలు ఏవీ అంటే.. యానిమల్, సలార్.. ఈ రెండూ గుర్తుకు వస్తాయి. ఈ రెండింటి సినిమాల మీద మంచి అంచనాలు వున్నాయి.  Advertisement సందీప్…

ఈ ఏడాది చివరిలో రాబోయే సినిమాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలు ఏవీ అంటే.. యానిమల్, సలార్.. ఈ రెండూ గుర్తుకు వస్తాయి. ఈ రెండింటి సినిమాల మీద మంచి అంచనాలు వున్నాయి. 

సందీప్ వంగా అందించే యానిమల్ సినిమా హీందీలో తీస్తున్నా, తెలుగు ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండో పాట విడుదల చేసారు. టీజర్ బయటకు వచ్చి ఈ సినిమా మీద మాంచి అంచనాలు పెంచింది.

రెండో పాట ట్యూన్, సాహిత్యం అనేవి మన వాళ్లకు అంతగా పట్టేవిగా లేవు. అది వాస్తవం. ఎందుకంటే పక్కా బాలీవుడ్ స్టయిల్ లో సాగింది పాట. కానీ పాటలో చిత్రీకరించిన భావోద్వేగాలు మాత్రం టాప్ లెవెల్ లో వున్నాయి. ఇటు రణ్ బీర్, అటు రష్మిక ఎవరికి వారే అన్నట్లు హావభావాలు కనబర్చారు.

తెలుగునాట బలమైన భావోద్వేగాలను తెరపైకి తెచ్చే దర్శకులు కొద్ది మందే వున్నారు. వారు కూడా సినిమాలో భాగంగా వాటిని చిత్రీకరిస్తారు తప్ప, కేవలం వాటితోనే సినిమాను నడిపడం అరుదు. కానీ సందీప్ వంగా యానిమల్ సినిమాను పూర్తిగా ఎక్స్ ట్రీమ్ ఎమోషన్స్ తో చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలోకి వస్తోంది.