ఏపీ టీడీపీ అధ్యక్షుడికి పెను సవాల్

ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా నియమితుడైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక పెద్ద సవాల్ గా మారింది అని అంటున్నారు. ఆయన నియోజకవర్గం పరిధిలోనే స్టీల్…

ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా నియమితుడైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక పెద్ద సవాల్ గా మారింది అని అంటున్నారు. ఆయన నియోజకవర్గం పరిధిలోనే స్టీల్ ప్లాంట్ ఉంది. మూడేళ్ళుగా ఈ  సమస్య అలాగే ఉంది.

స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడానికి కేంద్రం చూస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా గాజువాకలో ఉక్కు కార్మికులు కూటమికి ఓటేసి గెలిపించారు అని అంటున్నారు. అయితే టీడీపీ మీద ఆశతోనే ఇదంతా చేశారు అని చెబుతున్నారు. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కానీయకుండా ఆపుతుందని కార్మికులు అంటున్నారు.

ఇపుడు వారి ఆశలు రెట్టింపు అవుతున్నాయి. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి గాజువాక ఎమ్మెల్యేకే దక్కింది. దాంతో స్టీల్ ప్లాంట్ విషయంలో ఎమ్మెల్యేగానే కాకుండా టీడీపీ ప్రెసిడెంట్ గా మరింత చొరవ తీసుకుంటారు అని వారు నమ్ముతున్నారు.

విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని అన్ని రంగాలలో విశాఖను ముందున నిలబెడతామని పల్లా శ్రీనివాస్ అంటున్నారు. అదే చేత్తో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా చేయమని వారు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని పల్లా మూడేళ్ళ క్రితం అమరణ దీక్ష చేశారు. ఆయనకు కమిట్ మెంట్ ఉందనే ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇపుడు ఈ ఇష్యూ కేంద్రం చేతిలో ఉంది. చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పల్లాకు కీలక పాత్ర ఉంది. ఎటు నుంచి ఎటు తిరిగినా ఆయనకే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.