దేవర బ్లాక్ బస్టర్ కావాల్సిందే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ను డబుల్ చేసింది ఆర్ఆర్ఆర్ సినిమా. అంతకు ముందే ఒప్పుకున్న సినిమా దేవర. పాన్ ఇండియా లెక్కల మేరకు కాస్త అటు మార్చి, అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు. అయితే…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ను డబుల్ చేసింది ఆర్ఆర్ఆర్ సినిమా. అంతకు ముందే ఒప్పుకున్న సినిమా దేవర. పాన్ ఇండియా లెక్కల మేరకు కాస్త అటు మార్చి, అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు. అయితే మారిన లెక్కలు కావచ్చు, పాన్ ఇండియా ఆలోచనలు కావచ్చు. స్పెషల్ టికెట్ రేట్లు వస్తాయి అన్న నమ్మకం కావచ్చు. మొత్తం మీద భారీ రేట్లకు సినిమాను విక్రయిస్తున్నారు. సితార సంస్థ కు 115 కోట్లకు పైగా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంది.

ఆర్ఆర్ఆర్ ను పక్కన పెడితే, ఎన్టీఆర్ లాస్ట్ సినిమా అరవింద సమేత. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి వసూలు చేసిన షేర్ 70 కోట్లు. ఇప్పుడు రావాల్సిన షేర్ 115 కోట్లు. గడచిన మూడేళ్లలో థియేటర్ల పరిస్థితులు మారాయి. మల్టీ ఫ్లెక్స్ లు పెరిగాయి. సినిమా సరైనది పడితే కలెక్షన్లు కుమ్మేస్తాయి. కానీ అలా అని ఏ రేంజ్ వరకు వెళ్తాయి అన్నదానికి కూడా ఓ లిమిట్ వుంది. గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల కలెక్షన్లు పరిశీలిస్తే ఈ సంగతి తెలుస్తుంది.

హోల్ సేల్ బయ్యర్ అయిన నాగవంశీ హ్యపీ కావాలంటే, 115 కోట్ల షేర్, ప్లస్ యాభై కోట్ల కమిషర్ (బయ్యర్లకు, నాగవంశీకి కలిపి), ఖర్చులు, జిఎస్టీలు రావాల్సి వుంటుంది. ఈ ఫీట్ సాధిస్తే రాబోయే ఎన్టీఆర్ సినిమాల రేంజ్ ఓ రేంజ్ కు చేరిపోతుంది. పుష్ప 2 కు చెప్పినట్లు ఈసారి ఒక్క ఆంధ్రనే 90 నుంచి 100 కోట్ల రేంజ్ లో విక్రయిస్తారు. ఇవన్నీ జరగాలంటే దేవర బ్లాక్ బస్టర్ కావాల్సిందే.