ఆత్రగాడికి ఆకులో వడ్డించవచ్చు గానీ..

ఆత్రగాడికి ఆకులో వడ్డించవచ్చు గానీ.. నాకు మాత్రం నేల మీదనే వడ్డించు అన్నాడట.. వెనకటికి ఓ ప్రబుద్ధుడు! క్షణం కూడా ఓపిక పట్టలేని అత్యంత ఆత్రగాడి గురించి చెప్పేందుకు ఈ సామెత వాడతారు. Advertisement…

ఆత్రగాడికి ఆకులో వడ్డించవచ్చు గానీ.. నాకు మాత్రం నేల మీదనే వడ్డించు అన్నాడట.. వెనకటికి ఓ ప్రబుద్ధుడు! క్షణం కూడా ఓపిక పట్టలేని అత్యంత ఆత్రగాడి గురించి చెప్పేందుకు ఈ సామెత వాడతారు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తన భవిష్యత్తు ఏమిటో తెలియకుండా విలవిల్లాడుతున్న వారిలో ఒకరైన కోడెల శివరాం పరిస్థితి కూడా అలాగే ఉంది. తన తండ్రి కోడెల శివప్రసాద్ పై పెట్టిన కేసులే ఇప్పుడు జగన్ మీద పెట్టాలని ఆయన రంకెలు వేస్తున్నారు. జగన్ మీద కూడా అర్జంటుగా పదేళ్లు జైల్లోకి పంపడానికి తగిన కేసులు పెట్టాలని ఆరాటపడిపోతున్నారు.

కాకపోతే కోడెల శివరామ్ ఆవేదన కాస్త తలాతోకా లేకుండా ఉంది. ప్రజలు నవ్విపోయేలా ఉంది. ఎందుకంటే.. అప్పట్లో కోడెల శివప్రసాద్ ఏపీ అసెంబ్లీ స్పీకరుగా ఉంటూ.. హైదరాబాదులోని అసెంబ్లీని ఖాళీచేసిన ఫర్నిచర్ ను అమరావతికి తరలించే ముసుగులో.. మధ్యలో తన ఇంట్లోను, తన కొడుకు షోరూంలోనూ దించేసుకున్నారు. ఇది అచ్చంగా ప్రభుత్వం సొత్తును దొంగిలించడమే అవుతుంది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తన బండారం బయటపడుతుందని భయపడి.. ఆ ఫర్నిచర్ ను తీసుకువెళ్లాల్సిందిగా కొత్త స్పీకరుకు లేఖ రాశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనపై కేసు పెట్టింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదుతో 409 సెక్షన్ కింద పదేళ్ల జైలుశిక్ష పడే కేసు పెట్టారట.

ఇప్పుడు జగన్ ఇంట్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫర్నిచర్ ఇంకా ఉన్నది గనుక.. ఆయన ఇంకా తీసుకెళ్లాలని లేఖ రాయలేదు గనుక.. జగన్ మీద కూడా అదే కేసు పెట్టాలనేది కోడెల శివరామ్ కోరిక! ఈ లాజిక్ వింటే పాపం.. కోడెల శివరామ్ కు చంద్రబాబు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదో ఎవ్వరికైనా ఇట్టే అర్థమైపోతుంది. 

జగన్ ఇంట్లో ప్రభుత్వం పెట్టిన ఫర్నిచర్ ను ప్రభుత్వమే తీసుకువెళుతుంది. కోడెల శివప్రసాద్ చేసిన పని అది కాదు. శివరామ్ షోరూంలో ప్రభుత్వం ఫర్నిచర్ పెట్టలేదు. ఆయన తండ్రి కోడెల దొంగతనంగా తీసుకువెళ్లి అక్కడ పెట్టించుకున్నాడు. దొరికిపోతాం అని భయపడి లేఖ రాశాడు. కానీ జగన్ కు అలాంటి లేఖ రాసే అవసరం లేదు. ప్రాసెస్ ప్రకారం ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే సంగతి పాపం ఈ భవిష్యత్తు లేని నాయకుడు ఎప్పటికి తెలుసుకుంటాడు? అని ప్రజలు విస్తుపోతున్నారు.