ప్రభాస్ నాతో నటించలేదు – మంచు విష్ణు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు విష్ణు. Advertisement “కన్నప్ప సినిమాలో…

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు విష్ణు.

“కన్నప్ప సినిమాలో ప్రభాస్ నాతో నటించలేదు. నాతో మాత్రమే నటించలేదు. అతడి పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి నేను చెప్పలేను. సినిమాలో అతడు ఎవరితో నటించాడు, ఎంత సేపు కనిపిస్తాడు లాంటి వివరాలు ఇప్పుడే చెప్పను. నా ఒక్కడితోనే ఆయన చేయలేదు.”

ఇలా కన్నప్ప సినిమాలో తనకు, ప్రభాస్ కు మధ్య సీన్స్ లేవనే విషయాన్ని బయటపెట్టాడు మంచు విష్ణు. మరో 2-3 నెలల్లో ప్రభాస్ పాత్రను రివీల్ చేస్తామని వెల్లడించిన విష్ణు.. సినిమాలో ప్రభాస్ ది పెద్ద పాత్ర అని, నిడివి ఎంతనేది మాత్రం చెప్పనని అంటున్నాడు.

జులై నుంచి ప్రతి సోమవారం కన్నప్ప సినిమా నుంచి ఓ అప్ డేట్ వచ్చేలా డిఫరెంట్ గా ప్రమోషన్ ప్లాన్ చేశారు. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి కిందట రిలీజైంది. ఈ సందర్భంగా మాట్లాడిన విష్ణు, ఈ విషయాల్ని బయటపెట్టాడు.

కన్నప్పలో నటించిన కీలక నటీనటులంతా టీజర్ లో కనిపించారు. కాకపోతే వాళ్ల కళ్లను మాత్రమే చూపించారు. ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్.. ఇలా కీలక పాత్రలు పోషించిన స్టార్స్ అందర్నీ క్లోజప్ లో మాత్రమే చూపించారు. మంచు విష్ణు గెటప్, ఎలివేషన్స్ కోసమే టీజర్ ను ఎక్కువగా వాడుకున్నారు. టీజర్ లో భక్తి కంటే యాక్షన్ ఎక్కువగా కనిపించింది. త్వరలోనే కీలక పాత్రధారుల వీడియోలు ఒక్కొక్కటిగా వస్తాయి.