ఇది ‘మంచు వారి’ కన్నప్ప

ఎవరి దృష్టి కోణం వారికి వుంటుంది. బాపు రమణలు కన్నప్పను ఓ విధంగా దర్శిస్తే, మంచు ఫ్యామిలీ మరో విధంగా చూస్తోంది. కన్నప్ప అంటే భారీ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.…

ఎవరి దృష్టి కోణం వారికి వుంటుంది. బాపు రమణలు కన్నప్పను ఓ విధంగా దర్శిస్తే, మంచు ఫ్యామిలీ మరో విధంగా చూస్తోంది. కన్నప్ప అంటే భారీ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు చాలా భారీ తారాగణం వుందీ సినిమాలో. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. టీజర్ మొత్తం ఓ భారీ యాక్షన్ సినిమాను తలపించింది.

టీజర్ లో కన్నప్పను ఓ అరివీర భయంకర పోరాట వీరుడిగా చూపించారు. పదుల కొద్దీ శతృవులను మట్టు పెట్టిన సీన్లు టీజర్ లో చోటు చేసుకున్నాయి. కత్తి, విల్లు ఇలా పలు ఆయుధాలు వాడుతూ మంచు విష్ణు చుట్టూ తిప్పారు టీజర్ ను. మిగిలిన నటులు అందరినీ ఎట్ ఎ గ్లాన్స్ చూపించారు. ప్రభాస్ ను శివుడిగా చూపించారు.

కన్నప్ప ఇలాగే వుంటాడు.. వుండాలి అని ఏమీ లేదు. కొమరం భీమ్, అల్లూరి పాత్రలను ఫిక్షన్ చేయగా లేనిది కన్నప్ప పాత్రను ఇలా చిత్రీకరించకూడదని ఏమీ లేదు కదా. అందువల్ల రాజమౌళిని యాక్సెప్ట్ చేసారు కనుక మంచు వారి కన్నప్పను కూడా అంగీకరించాల్సిందే. 

ఇప్పటికి వదిలింది జస్ట్ టీజర్ మాత్రమే. ఇందులో సెట్ లు ఏవీ లేవు. జస్ట్ గెటప్ లు మాత్రమే. అందువల్ల భారీ తనం తెలియాలి అంటే ఇంకా మరింత కంటెంట్ రావాల్సి వుంటుంది.