ఆచార్య సినిమా విడుదల దగ్గరకు వచ్చింది. 23న ప్రీ రిలీజ్ ఫంక్షన్. మరి చీఫ్ గెస్ట్ ఎవరు? చాలా మంది ఫంక్షన్ లకు చీఫ్ గెస్ట్ మెగాస్టార్. మరి ఆయన సినిమాకు. ఇంకెవరు..ఎస్ ఎస్ రాజమౌళి.
యూసఫ్ గుడా పోలీస్ గ్రవుండ్స్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతొంది. శ్రేయాస్ ఈవెంట్స్ నిర్వహించే ఈ ఈవెంట్ లో స్టేజ్ మీద రాజమౌళి, కొరటాల, మెగాస్టార్, రామ్ చరణ్, పూజా హెగ్డే అలరించబోతున్నారు.
ఇంకా పలువురు సినిమా సెలబ్రిటీ డైరక్టర్లు ఈ ఫంక్షన్ కు హాజరు కాబోతున్నారు. పుష్ప, భీమ్లా నాయక్ ఇదే గ్రవుండ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు జరుపుకున్నాయి. అదే సెంటిమెంట్ తో ఈ గ్రవుండ్ ను ఫిక్స్ చేసారు.
ఆచార్య సినిమా కోవిడ్ కారణంగా చాలా ఆలస్యం అయింది. ఆర్ఆర్ఆర్ తో మాంచి పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. ఆ తరువాత సినిమా ఇదే. అందుకే ఆ విధంగా మాంచి క్రేఙ్ వుంది ప్రాఙెక్టుకు.
ఇప్పుడు అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ కు బజ్ రావాలంటే ఇలాంటి భారీ ఫంక్షన్ వుండాల్సిందే. ఇలాంటి చీఫ్ గెస్ట్ రావాల్సిందే