వైసీపీ ఓటమికి కారణాలు!

ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అత్యంత ఘోర ప‌రాజ‌యం పొంద‌డాన్ని ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇది క‌లా? నిజ‌మా? అని అనుకునే ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో వైసీపీ…

ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అత్యంత ఘోర ప‌రాజ‌యం పొంద‌డాన్ని ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇది క‌లా? నిజ‌మా? అని అనుకునే ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో వైసీపీ ప‌రాజ‌యంపై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో వైసీపీ అభిమానులు ప్ర‌స్తావిస్తున్న కీల‌క అంశాల గురించి తెలుసుకుందాం.

– జగన్ మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలు

– సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించటం

– ఎమ్మెల్యేల‌ను, నేతలను జగన్ పట్టించుకోకపోవటం

– వైసీపీ ఎమ్మెల్యేలు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోపోవటం, ఎదగనీయక పోవటం

– అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్యేలు, వారి అనుచ‌రులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.అవినీతి, దోపిడీకి తెగబడటం.

– ఉద్యోగులపై అనుచిత వైఖరి

– అభ్యర్థులను ఇష్టమొచ్చినట్లు మార్చటం

– కొందరు మంత్రుల నోటి దురుసు

– మద్యం విధానంలో నిజాయితీ లోపించటం

– రాజకీయాలలో మిత్రుల అవసరాన్ని తక్కువగా అంచనా వేయటం

– టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కలయిక ప్రభావాన్ని అంచనా వేయకపోవటం

-ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ప్ర‌ధానంగా జ‌గ‌న్ ప‌దేప‌దే కించప‌రిచేలా మాట్లాడ్డం. కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గీయులు త‌మ‌ను అవ‌మానిస్తున్నార‌ని భావించ‌డం

– స్థానిక ఎన్నికల్లో అధికార బలంతో ఏకగ్రీవాలు చేసుకోవటం

– జగన్ తన సొంత కుటుంబంలోని సమస్యలనూ పరిష్కరించుకోకపోవటం

-ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా విజ‌య‌మ్మ వీడియో విడుద‌ల చేయ‌డం. సొంత త‌ల్లే జ‌గ‌న్‌కు అండ‌గా లేద‌నే సంకేతాలు వెళ్ల‌డం

– నాయకుల కంటే వాలంటీర్ల వ్యవస్థ మీదే  పూర్తిగా ఆధారపడటం

– భూముల పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవటం

– భూముల సర్వే వల్ల  రైతుల్లో ఏర్పడిన భయం

-ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల్ని వైసీపీ నేత‌లు లాక్కుంటార‌నే ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌లకు బ‌లం ఇచ్చేలా వైసీపీ స‌ర్కార్ ప్ర‌వ‌ర్తించ‌డం

– సొంత సామాజిక వర్గంలో జగన్ మీద కోపం

– అర్హ‌త లేని వారినే జ‌గ‌న్ అంద‌లం ఎక్కించ‌డం

-భ‌జ‌న‌ప‌రులైతే చాలు… జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టుకుంటార‌నే అభిప్రాయం వైసీపీ నేత‌ల్లో క‌ల‌గ‌డం

-ప్ర‌తిదానికీ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని మీడియా ముందుకు పంప‌డం. అలాంట‌ప్పుడు సీఎంగా జ‌గ‌న్ ఎందుకనే అస‌హ‌నం ప్ర‌జ‌ల్లో క‌ల‌గ‌డం

-ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వైసీపీ మేనిఫెస్టో లేక‌పోవ‌డం