విశాఖ జాతకం ఎలా ఉంది?

ఏపీలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తున్నాయి. రాజకీయ పార్టీలు అభ్యర్ధుల జాతకాలతో పాటు విశాఖ జాతకం గురిచి కూడా చర్చ సాగుతోంది. విశాఖ గురించే ఎందుకు అంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది…

ఏపీలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తున్నాయి. రాజకీయ పార్టీలు అభ్యర్ధుల జాతకాలతో పాటు విశాఖ జాతకం గురిచి కూడా చర్చ సాగుతోంది. విశాఖ గురించే ఎందుకు అంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది కనుక. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ ప్రామిస్ చేసింది. ఆ దిశగా ప్రతిపాదనలు సాగాయి. న్యాయపరమైన అడ్డంకుల వల్ల అది నిలిచింది. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రే విశాఖ వస్తారు. విశాఖ నుంచే పాలన సాగుతుంది.

సీఎం క్యాప్ ఆఫీస్ విశాఖలోనే ఉంటుంది. అదే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే విశాఖ అభివృద్ధి ఏమీ ఆగదు కానీ రాజధాని యోగం మాత్రం ఉండదు అన్నది స్పష్టం. అమరావతినే రాజధానిగా ప్రకటించిన టీడీపీ అక్కడే మొత్తం దృష్టి పెడుతుంది.

అమరావతి అందుకు వచ్చేలోగా విశాఖను వేదికగా చేసుకుని వీలైన విధంగా వాడుకునే అవకాశం ఉంది. విశాఖకు మాత్రం రాజముద్ర అయితే ఉండదు. విశాఖకు రాజధాని వస్తే ఏమిటి పోతే ఏమిటి అన్న మాట సగటు జనంలో ఉండొచ్చు. కానీ రాజధాని చుట్టూ అభివృద్ధి అల్లుకుంటుందన్న విషయం చాలా మందికి తెలుసు.

అత్యంత వెనకబడిన జిల్లాలుగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి. కేంద్రం నియమించిన శిపలు కమిటీలు కూడా  ఆ సంగతి చెప్పిన సంగతి విధితమే. విశాఖకు రాజ హోదా ఇస్తే అది శ్రీకాకుళం చివరన ఉన్న ఇచ్చాపురం దాకా అభివృద్ధికి దోహదపడుతుంది.

పైగా విశాఖ రాజధాని అన్న కోరిక 1953 ప్రాంతం నుంచి ఉంది. అది అపుడు తీరకపోయినా ఎపుడో ఒకపుడు తీరుతుంది అనుకున్న వారు  ఈ ఎన్నికలను  ఒక అగ్ని పరీక్షగానే చూస్తున్నారు. అందువల్ల పార్టీల జాతకంతో పాటు విశాఖ జాతకం కూడా తేల్చేసే ఎన్నికగా ఈసారి వచ్చే ఫలితాలను  విశ్లేషిస్తున్నారు.