దేవుడు కనిపిస్తున్నాడు!

అన్నీ దారులూ అయిపోయాక అయోమయం మొత్తం కమ్ముకున్నాక కనిపించేది తప్పకుండే దేవుడే అవుతాడు. నాస్తికుడు అయితే బయటకు చెప్పుకోడు కానీ ఆస్తికుడు బాహాటంగానే దేవుడా దయ చూపించు అని వేడుకుంటాడు. Advertisement ఏపీలో ఇపుడు…

అన్నీ దారులూ అయిపోయాక అయోమయం మొత్తం కమ్ముకున్నాక కనిపించేది తప్పకుండే దేవుడే అవుతాడు. నాస్తికుడు అయితే బయటకు చెప్పుకోడు కానీ ఆస్తికుడు బాహాటంగానే దేవుడా దయ చూపించు అని వేడుకుంటాడు.

ఏపీలో ఇపుడు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు ఎన్నడూ చూడనివి. భవిష్యత్తులో చూడలేనివి. ఎందుకంటే అంత బలంగా ప్రత్యర్ధులు పోరాడిన తీరు ఈసారి కనిపించింది. దాంతో ఫలితాల మీద ఎవరూ ఖరారు అయిన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు.

నిట్టనిలువునా అంతా చీలిపోయిన నేపధ్యం ఉంది. ఆఖరుకు ఎగ్జిట్ పోల్స్ లోనూ ఏమీ తేలకపోగా సగం అటూ సగం ఇటూ అంటూ సేఫ్ గేమ్ ఆడేసిన సన్నివేశం కనిపిస్తోంది. జోస్యాలు కూడా అయిపోయాయి. వారూ రాజకీయ రంగుతో కనిపిస్తున్నారు. దాంతో ఏమి చేయాలో పోటీ చేసిన అభ్యర్ధులకు పాలుపోవడం లేదు. జూన్ 3వ తేదీ నాటికి అంటే కౌంటింగ్ కి ఘడియలు సమీపిస్తున్న వేళ గుళ్ళూ గోపురాలకు అభ్యర్ధులు తిరగడం మొదలెట్టారు.

దేవుడా గండం గట్టెక్కించు అంటూ అభ్యర్థులు పూజలు చేస్తున్నారు. మేమే గెలుస్తామని మీడియా ముందు చెబుతున్నా మనసులో మాత్రం ఆందోళన ఉంది. దాంతో దేవుడి మీద భారం వేస్తే కాస్త అయినా తగ్గుతుంది అని భావించిన వారు అంతా కౌంటింగ్ ముందు రోజు పొర్లు దండాలే పెట్టేశారు.

కనిపించని దైవం చేతిలో మహిమ ఉందని అదే ఈవీఎంలలో ఫలితాన్ని అనుకూలం చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. మేము గెలుస్తాం, మా పార్టీ గెలుస్తుంది అంటూ కాస్తా గుండె చిక్కబట్టుకుని ఆలయాల నుంచి బయటకు వస్తున్న అభ్యర్ధులు చెబుతున్న మాటలు. ఈ ధైర్యం ఎంత సేపు ఉంటుందో ఎవరికీ తెలియదు. కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక గుండె వేగాన్ని కొలవడం ఎవరి వల్లా కాదేమో.