దిల్ రాజు.. మైత్రీ రూట్ లో..!

నిర్మాత దిల్ రాజు మైత్రీ మూవీస్ రూట్ లో వెళ్లాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అదేంటీ అంటే చాలా వివరంగా చెప్పాల్సి వుంది. టాలీవుడ్ లో రాను రాను సినిమా ఫైనాన్సింగ్ తగ్గుతోంది. భారీ సినిమాలు…

నిర్మాత దిల్ రాజు మైత్రీ మూవీస్ రూట్ లో వెళ్లాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అదేంటీ అంటే చాలా వివరంగా చెప్పాల్సి వుంది. టాలీవుడ్ లో రాను రాను సినిమా ఫైనాన్సింగ్ తగ్గుతోంది. భారీ సినిమాలు పెరుగుతున్నాయి. చిన్న సినిమాలు తగ్గుతున్నాయి. ఫైనాన్స్ మీద రిస్క్ ఫ్యాక్టర్ కూడా పెరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఫైనాన్షియర్లు ఆచి తూచి ముందుకు అడుగు వేస్తున్నారు. అలా వేసినా కూడా రెండు రూపాయల వడ్డీ వుంటుంది. పైగా ఇప్పుడు సినిమాలకు పదుల నుంచి వందల కోట్లు అవసరం పడుతున్నాయి. దాంతో సినిమా బడ్జెట్ ను ఈ వడ్డీలు కూడా చాలా వరకు పెంచేస్తున్నాయి.

ఇక్కడ మైత్రీ ప్రస్తావన ఎందుకు అంటే మైత్రీ అనే సంస్థ అమెరికాలో సెటిల్ అయిన మన తెలుగు వాళ్ల సంస్థ. అక్కడ మన ఎన్నారైలు ఎంతో మందికి మైత్రీతో మంచి బంధాలు వున్నాయి. అందువల్ల ఎన్నారైలు ఎంతో మంది తన డబ్బు మైత్రీలో పెట్టుబడిగా పెట్టారు అనే టాక్ బలంగా వుంది. నమ్మకమైన, సన్నిహితమైన వారు. అందువల్ల ఎన్నారైలు మైత్రీకి తక్కువ వడ్డీకి కూడా ఇస్తారు పెట్టుబడులు అని టాలీవుడ్ లో విస్తృతంగా వున్న ప్రచారం.

ఇప్పుడు మళ్లీ వెనక్కు వస్తే.. దిల్ రాజు కూడా లేటెస్ట్ గా అమెరికాలో మన వాళ్లకు పిలుపు ఇచ్చారు. సినిమాలు తీయాలి, నిర్మాణంలో పాలు పంచుకోవాలి. పెట్టుబడులు పెట్టాలి అంటే తనతో కలిసి నడవవచ్చు అంటూ. అంటే భాగస్వామ్యంలో సినిమాలు చేయడానికి తాను సిద్దంగా వున్నాననే హింట్ ఇచ్చారన్న మాట.

దిల్ రాజు గతంలో కూడా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను బలోపేతం చేసుకోవానికి ఓ స్కీము అనౌన్స్ చేసారు. ఎవరైనా నిర్మాతలు మంచి ప్రాజెక్ట్ తో వస్తే, తను అండదండలు అందిస్తానని, ఆ సినిమాలకు తన బ్యానర్ యాడ్ చేసి, పంపిణీ చేస్తానని. అప్పట్లో పలువురు చిన్న నిర్మాతలతో ఈ మేరకు ఓ భారీ అనౌన్స్ మెంట్ ఈవెంట్ కూడా చేసారు.

ఇప్పుడు నిర్మాణంలో పెట్టుబడుల విషయంలో కొత్త పంథాలోకి అడుగుపెట్టేందకుు దిల్ రాజు తన అమెరికా పర్యటనను వాడుకున్నట్లు కనిపిస్తోంది. మంచి ఆలోచనే. దిల్ రాజు లాంటి బ్యానర్ లో పెట్టుబడి పెట్టడం అంటే సేఫ్ గేమ్ నే కదా. ఆ విధంగా మైత్రీ మాదిరిగా తను కూడా ఎన్నారై ఫండ్స్ ను తక్కువ వడ్డీకి లేదా భాగస్వామ్యానికి తెచ్చుకోవచ్చు.