గత కొంతకాలంగా వినిపించిన గ్యాసిప్ ఏమిటంటే, కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ హోం మంత్రి అన్నది.
కానీ ఇప్పుడు కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినా పవన్ ఏ పదవి తీసుకోరు అన్నది ఆ వార్త. నిజానికి కూటమి అధికారంలోకి వస్తే, పవన్ పదవి తీసుకున్నా, తీసుకోకపోయినా, ఆయన మాట చెల్లుతుంది. అనుకున్నది జరుగుతుంది. అందువల్ల పదవే తీసుకోవాలని లేదు.
కానీ ఇక్కడ ఓ మతలబు వుంది. పవన్ పదేళ్ల టార్గెట్ పెట్టుకున్నారు సిఎమ్ కావడానికి. 2033 నాటికి సిఎమ్ కావాలన్నది. కూటమి అధికారంలోకి వచ్చి కూడా పాలన బాగా లేకుంటే 2029 కే టార్గెట్ చేయవచ్చు.
ఇలాంటి ఆలోచన వున్నపుడు పదవిలో వుంటే, పాలనలో భాగం చే పంచుకున్నట్లే. అప్పుడు విమర్శించే అవకాశం వుండదు. పైగా తన సినిమాలు తాను కంటిన్యూ చేసుకోవచ్చు. కనీసం అయిదేళ్లలో పది సినిమాలు చేసినా, ఆరేడు వందల కోట్ల ఆదాయం. ఎందుకు వదులుకోవాలి ప్రొఫెషన్.
అందుకే పవన్ మంత్రి మండలికి దూరంగా వుండబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్వరలో సినిమా షూటింగ్ కు వస్తా అని పవన్ నిర్మాతలకు సమాచారం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చేదీ రానిదీ మరో మూడు రోజుల్లో తేలిపోతుంది. అప్పుడు పవన్ నిర్ణయం కూడా తెలుస్తుంది.