చిత్రమైన కాంబినేషన్ ఇది. సంపత్ నంది అంటే మాస్ యాక్షర్ ఎంటర్ టైనర్లు అందిస్తారు. పక్కా మాస్ మసాలా వుంటుంది సినిమాల్లో. శర్వానంద్ అంటే లవ్ లీగా, నెమ్మదిగా, ఫ్యామిలీ హీరోగా వుంటాడు. సీరియస్ పాత్రలు చేయగల సత్తా వుంది కానీ, మాస్ యాక్షన్ అల్లరి అన్నది ఎప్పుడో రన్ రాజా రన్ టైమ్ లో చూసాం. ఇప్పుడు ఈ సంపత్ నంది.. ఆ శర్వానంద్ కలిసి సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.
పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశం వుంది. సంపత్ నంది- సాయిధరమ్ తేజ్ కాంబినేషన్, సితార నిర్మాణం అనుకున్నారు. కానీ అది ఎందుకో పక్కన పెట్టారు. చిరకాలంగా సంపత్ నంది ఓ మంచి మాస్ సబ్జెక్ట్ పట్టుకుని రెడీగా వున్నారు. కానీ కాంబినేషన్ సెట్ కావడం లేదు. ఇప్పటికి ఆ సమస్య తీరినట్లుంది.
రచ్చ నుంచి సీటీమార్ వరకు సంపత్ నంది అన్నీ మంచి మాస్ సినిమాలే అందిస్తూ వస్తున్నారు. కానీ అక్కడ బ్రేక్ పడింది. హీరోలు అందుబాటులో లేక అలా వెయిటింగ్ లో వుండిపోయారు. మధ్యలో వెబ్ మూవీస్ వగైరా చేసుకుంటూ వస్తున్నారు. శర్వానంద్ కూడా మంచి మాస్ క్యారెక్టర్ చేసి తన కెరీర్ ను టర్నింగ్ ఇచ్చుకోవాల్సి వుంది. అందుకు ఇప్పుడు టైమ్ వచ్చినట్లుంది.