ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తక్షణ ఉపశమనం లభించలేదు. వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ.. జూన్ 5న తీర్పును వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది. దీంతో ఆయన రేపు తిహార్ జైలులో తప్పక సరెండర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ రోజుతో కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుంది. అయితే వైద్యపరమైన కారణాలతో బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ కు సార్వత్రిక ఎన్నికలు, ప్రచారాల నేపథ్యంలో మే 10 నుంచి జూన్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
నిన్న ఓ వీడియోలో మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుపడుతూ.. 50 రోజుల పాటు జైలులో ఉండటంతో ఆరోగ్యం చాలా వరకూ క్షీణించిందని, బరువు తగ్గిపోయానని.. షుగర్ మందులు కూడా ఇవ్వడం లేదని.. ఒకవేళ తాను దేశం కోసం చనిపోతే…ఎవరూ బాధపడొద్దని.. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడేందుకు తాను జైలుకు వెళ్లడం గర్వంగా ఉందని అన్నారు.