అది బాలయ్య మార్కు ‘మోటు సరసం’

బాలయ్య ‘మందు’ బాగోతం వీడియో సాక్షిగా బయటపడిన కొన్ని గంటలకే, మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మందు కొట్టే అలవాటున్న బాలయ్యకు, అదే టైమ్ లో చేయి చేసుకునే అలవాటు కూడా…

బాలయ్య ‘మందు’ బాగోతం వీడియో సాక్షిగా బయటపడిన కొన్ని గంటలకే, మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మందు కొట్టే అలవాటున్న బాలయ్యకు, అదే టైమ్ లో చేయి చేసుకునే అలవాటు కూడా ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

ఆయన మందు కొట్టి హీరోయిన్ పై చేయి చేసుకున్నారు. అది కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే. పైగా వేదికపైనే. ఈసారి బాలయ్య ‘చేతివాటం’ రుచిచూసిన హీరోయిన్ అంజలి.

వేదిక కింద కూర్చున్నంతసేపు బాలయ్య కాళ్ల దగ్గర వాటర్ బాటిల్ లో మద్యం పోసి ఉంచిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ బాటిల్ ఖాళీ చేసిన తర్వాత వేదికపైకి వెళ్లారు బాలయ్య. అటు నేహాశెట్టి, ఇటు అంజలి నిల్చున్నారు.

ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో ఏమో, సడెన్ గా అంజలిపై చేయి వేసి, ఆమెను వెనక్కు నెట్టారు బాలయ్య. దీంతో ఒక్కసారిగా అంజలి షాక్ అయింది, వెనక్కు తూలి పడకుండా తమాయించుకుంది. ఆ వెంటనే నవ్వేసింది. ఆమె అలా నవ్వింది కాబట్టి అది సీరియస్ మేటర్ అవ్వలేదు.

బాలయ్య మద్యం బాటిల్ మేటర్ పై అతడ్ని వెనకేసుకొచ్చిన నందమూరి అభిమానులు, ఈ మేటర్ ను కూడా అంతే తేలిగ్గా తీసుకున్నారు. మద్యం బాటిల్ చూసి ఎలాగైతే యాపిల్ జ్యూస్ అంటూ కలరింగ్ ఇచ్చారో, అంజలిపై చేయిచేసుకున్న ఘటనపై కూడా అంతే కవరింగ్ ఇచ్చారు.

అంజలిపై బాలయ్య చూపించిన ప్రేమ అంట అది. ఇంకా చెప్పుకోవాలంటే దాన్ని మోటు సరసం అంటున్నారు నందమూరి వీరాభిమానులు. గతంలో బాలయ్య-అంజలి కలిసి ఓ సినిమా చేశారు. ఆ ‘అనుబంధం’తో  అంజలిపై అలా చేయి వేసి, సుతారంగా వెనక్కు నెట్టారట బాలయ్య.