ఎన్నికలు అయిపోయాయి. కౌంటింగ్ దూరంగా వుంది. సినిమాలు డల్ గా వున్నాయి. వార్తలు లేవు. ఇలాంటి టైమ్ లో దొరికింది మీడియాకు స్పైసీ న్యూస్. సీనియర్ హీరో బాలకృష్ణ మందు బాటిల్ వ్యవహారం. నిన్నటికి నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫంక్షన్ జరిగింది. దానికి చీఫ్ గెస్ట్ బాలకృష్ణ. ఓ నీళ్ల సీసాతో పాటు, మందు కూడా వాటర్ బాటిల్ లో పోసి ఆయన కాళ్ల పక్కన పెట్టారు. అది కాస్తా లైవ్ రికార్డింగ్ వీడియోలో చిక్కింది. దాంతో ఇదిగో బాలయ్య- అదిగో మందు అంటూ ఒకటే హడావుడి.
బాలయ్యకు మందు అలవాటు వుందని, ఆయన విదేశాలకు వెళ్లినపుడు సైతం కూడా తన బ్రాండ్ లిక్కర్ ను క్యారీ చేస్తారనే టాక్ వుంది. అసలు ఆ మాటకు వస్తే బాలయ్య ఏమి ఖర్మ… దాదాపు 90 పర్సంట్ సినిమా జనాలకు అందరికీ లిక్కర్ హ్యాబిట్ వుంది. మరో సీనియర్ టాప్ హీరో కూడా సాయంత్రం సినిమా ఫంక్షన్ లకు వస్తే లిక్కర్ సేవించే వస్తారని, అందుకే కాస్త ఓవర్ గా మాట్లాడతారని టాక్ వుంది. ఓ యంగ్ టాప్ హీరో రాత్రి అయితే చాలు టాప్ ప్రొడ్యూసర్లను దగ్గర పెట్టుకుని పార్టీ మొదలు పెడతారని టాక్ వుంది.
మిడ్ రేంజ్ యంగ్ హీరోలు ఇద్దరు ముగ్గురు వున్నారు. వాళ్లు డైలీ రాత్రి పన్నెండు దాటి రెండు అయ్యే వరకు లిక్కర్ సేవిస్తూనే వుంటారని టాక్ వుంది. ఇలా సినిమా హీరోలు, దర్శకులు ఎవరూ లిక్కర్ అలవాటుకు అతీతీలు కాదు. కానీ ఎటొచ్చీ బాలయ్య మరీ ఓ నీళ్ల సీసాలో మందు పోసుకుని తెచ్చుకోవడం, దాన్ని వాటర్ బాటిల్ తో కలిపి కాళ్ల దగ్గర పబ్లిక్ గా వుంచుకోవడం అన్నది టాక్ ఆఫ్ ది మీడియా అయిపోయింది.
లైవ్ కాకుంటే నిర్వాహకులు ఆ పుటేజ్ బయటకు వెళ్లకుండా చూసేవారు. కానీ లైవ్ కావడంతో వెళ్లిపోయింది. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. తాగితే తప్పేంటీ అని కొందరు. అది లిక్కర్ అని మీకెవరు చెప్పారు.. అది యాపిల్ జ్యూస్ అని ఇంకొందరు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… ఎవరు ఏమనుకున్నా, బాలయ్య అసలు పట్టించుకుంటే కదా, ఆయన ఎవరు ఏం ప్రచారం చేసినా, ఏం రాసుకున్నా, ఎలా అనుకున్నా, తన దారి తనదే తప్ప అస్సలు పట్టించుకోరు. మనసుకు తీసుకోరు.
అందువల్ల ఇదంతా వన్ డే ముచ్చట.