ఈ మాట ఎలా అర్ధం చేసుకోవాలి. ఒక్కసారిగా వింటే నెగిటివ్ అప్రోచ్ లోనే వెళ్తుంది. కానీ ఇది పక్కా పాజిటివ్ అప్రోచ్ తోనే అన్న మాట. దమ్ముగా ఒక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చెప్పిన మాట. మూడు పార్టీలు కలసి కట్టుగా వచ్చిన చోట. టీడీపీకి కంచుకోట లాంటి అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు అభ్యర్థిగా ప్రకటించబడిన మలసాల భరత్ కుమార్ తన గెలుపు గురించి పూర్తి ధీమా వ్యక్తం చేశారు.
ఇది అతి ధీమా కానే కాదు అంటున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి డౌట్ లేదు, నేను ఎమ్మెల్యేగా జూన్ 4 తరువాత ప్రజల లోకి వెళ్తున్నాను అని ప్రకటించారు. నా గెలుపు సంగతి మీ మైండ్ నుంచి తీసేయండి అని పార్టీ నేతలకు సూచించారు. గెలుపు పక్కా ఎనీ డౌట్స్ అని ఆయన అంటున్నారు.
అంతే కాకుండా ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. 2029లో కూడా అనకాపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తానే ఉంటాను అని. ఇది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని అంటున్నా ఎమ్మెల్యేగా నా పనితీరు అయిదేళ్ళ పాటు చూసిన మీదటనే జగన్ తనకే టికెట్ ఇస్తారు అని భరత్ అంటున్నారు
మరో అడుగు ముందుకేసి తన రాజకీయ జీవితం మూడు దశాబ్దాల పై మాటే అని భరత్ చెప్పేశారు. నాలుగు నెలల నుంచి ప్రారంభం అయిన తన రాజకీయ ప్రయాణం మరో ముప్పయ్యేళ్ల పాటు కొనసాగుతుందని వైసీపీ క్యాడర్ ని అంతా తనతో పాటుగా ఉంచుకుని ముందుకు సాగుతాను అని ప్రకటించారు.
వైసీపీకి అంతా పనిచేశారు అని ఆయన అభినందిస్తూనే తనకు క్యాడర్ పట్ల అభిమానమే తప్ప అనుమానం ఏ విధంగానూ లేదని అన్నారు. వైసీపీ సభ్యత్వం తీసుకుని పార్టీలో ఉన్న ప్రతీ కార్యకర్త తన గెలుపు కోసం పనిచేసారనే తాను మనస్పూర్తిగా భావిస్తున్నాను అన్నారు.
వైసీపీ విజయ పరంపర అనకాపల్లి నుంచే ప్రారంభం అవుతుంది అని ఆయన అంటున్నారు. మాజీ మంత్రి అనేక ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కలిగిన మాజీ మంత్రి కొణతాలను ఓడిస్తాను అని నవ యువకుడు భరత్ అంటున్నారు. ఆయన ధీమా మాత్రం అందరికీ నచ్చేసింది. నాయకుడికి ఉండాల్సిన దూకుడు డేరింగ్ ఆయనలో ఉన్నాయని తమ నేత ఎమ్మెల్యే అవడం తధ్యమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఫలితం జూన్ 4న తేలాల్సి ఉంది.