మరీ ఇంత తీసికట్టుగా ఉంటే ఎలా రెహ్మాన్!

ఏఆర్ రెహ్మాన్.. ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, దేశం గర్వించదగ్గ కంపోజర్, ఆస్కార్ విజేత. అయితే ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు రెహ్మాన్ వర్క్ చూస్తుంటే పెదవి విరుపులు తప్ప, చప్పట్లు పెద్దగా వినిపించడం లేదు.…

ఏఆర్ రెహ్మాన్.. ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, దేశం గర్వించదగ్గ కంపోజర్, ఆస్కార్ విజేత. అయితే ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు రెహ్మాన్ వర్క్ చూస్తుంటే పెదవి విరుపులు తప్ప, చప్పట్లు పెద్దగా వినిపించడం లేదు. అవును.. అతడిప్పుడు ఫామ్ లో లేడు.

రెహ్మాన్ కు ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి. అతడి వర్కింగ్ స్టయిల్ తో కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ, మ్యూజిక్ కోసం వెంట పడుతున్నారు కొంతమంది. రాయన్ సినిమా అవకాశం కూడా అలానే వచ్చింది.

ధనుష్ 50వ చిత్రం, పైగా స్వీయదర్శకత్వం కాబట్టి అన్నీ గొప్పగా ఉండాలని భావించి రెహ్మాన్ ను తీసుకున్నారు. కానీ మ్యూజిక్ మాత్రం అంత గొప్పగా అనిపించడం లేదు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్ వచ్చింది, తాజాగా రెండో పాట రిలీజ్ చేశారు.

రెండో పాట ఏమంత గొప్పగా అనిపించలేదు. రెహ్మాన్ మార్క్ కంపోజిషన్ ఎక్కడా కనిపించలేదు. అతడి స్టయిల్ లేదా ప్రయోగం ఎక్కడా కనిపించలేదు.

లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా కోసం రెహ్మాన్ ను తీసుకున్నారు. రాయన్ సాంగ్ విన్న తర్వాత చరణ్-బుచ్చిబాబు సినిమా మ్యూజిక్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది.