పారాహుషార్.. బాలయ్య గొంతు నుంచి మరో పాట

బాలయ్య నటిస్తే అందరూ చూస్తారు. కానీ ఆయన పాట పాడితే కొంతమంది మాత్రమే వింటారు. మిగతావాళ్లంతా భయభ్రాంతులకు గురవుతారు. ఆయన వాయిస్ పవర్ అలాంటిది. ఆయన చేసిన ‘శివశంకరి’ గాయాలు ఇంకా మానలేదు. Advertisement…

బాలయ్య నటిస్తే అందరూ చూస్తారు. కానీ ఆయన పాట పాడితే కొంతమంది మాత్రమే వింటారు. మిగతావాళ్లంతా భయభ్రాంతులకు గురవుతారు. ఆయన వాయిస్ పవర్ అలాంటిది. ఆయన చేసిన ‘శివశంకరి’ గాయాలు ఇంకా మానలేదు.

అప్పట్లో తన గాత్రంతో బాలయ్య చేసిన గాయాలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. “జగదేకవీరునికథ” సినిమాలోంచి “శివశంకరి” అనే పాటను పాడి అందర్నీ భయపెట్టారు. చాలా ప్రాక్టీస్ చేసి పాడానంటూనే, పాటను ఖూనీ చేశారు.

సినీచరిత్రలో క్లాసిక్ సాంగ్ గా నిలిచిన ఆ పాటను బాలయ్య పాడడంపై అప్పట్లో చాలా విమర్శలు చెలరేగాయి. నాగబాబు లాంటివాళ్లయితే, “కరోనా కంటే ప్రమాదకమైన సంగీతం సర్కులేట్ అవుతోంది జాగ్రత్త” అంటూ సెటైర్ వేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్ ను ఆయన డిలీట్ చేశారనుకోండి, అది వేరే సంగతి.

మళ్లీ ఇన్నాళ్లకు బాలయ్యకు మూడ్ వచ్చినట్టుంది. తనలోని గాయకుడ్ని మరోసారి నిద్రలేపారాయన. “అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటాను. మామా ఏక్ పెగ్ లా అంటుంటాను. ఇంకా చాలా పాడాను. అన్నీ ఉన్నాయి. నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకొస్తాయి. మీరు చూస్తూ ఉండండి.” అంటూ పెద్ద బ్రేకింగ్/షాకింగ్ న్యూస్ బయటపెట్టారు.  

తెలుగు ప్రేక్షకులది చాలా పెద్ద మనసు, నా కోసం వాళ్లు ఎప్పుడూ సిద్ధమే అంటూ తనకుతాను ప్రకటించుకున్న బాలయ్య.. సినీరంగంలోని అన్ని క్రాఫ్టులపై అవగాహన పెంచుకోవాలనేది తన అభిమతమని, ఒక దశలో కెమెరామెన్ కూడా అవుదామని అనుకున్నానని వెల్లడించారు. ఈ క్రమంలోనే పాటలు కూడా పాడుతున్నానని క్లారిటీ ఇచ్చిన బాలయ్య.. మంచి టైమ్ చూసి తన పాడిన ఓ పాటను వదలబోతున్నారు.