చాలా సైలంట్ గా, ఏ హడావుడి లేకుండా సినిమాలు సెట్ చేసుకునే నిర్మాత చిట్టూరి శ్రీను. ఏ గడబిడ వుండదు. హడావుడి వుండదు. క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూనే వుంటారు.
ఇప్పుడు మరో అలాంటి ప్రాజెక్టు సెట్ చేసారు. హీరో నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడిగా తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి ని తీసుకుంటున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేయడానికి కొంచెం టైమ్ వుంది.
శిబి చక్రవర్తి కి తమిళంలో వున్న ఒకటి రెండు కమిట్ మెంట్లు మాట్లాడుకుని సెట్ చేసుకోవాల్సి వుంది. అది అయిన తరువాత ఈ సినిమా ప్రకటన వుంటుంది. ప్రస్తుతం నాని ఓ సినిమాను సివిఎమ్ నిర్మాతగా చేస్తున్నారు. దాని తరువాత దానయ్య నిర్మాతగా వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయాలి. కానీ దాని కథ సెకండాఫ్ ఇంకా సెట్ కావడం లేదు.
ఈ లోగా ఈ కొత్త ప్రాజెక్టు కూడా టేకప్ చేసే ఆలోచనలో వున్నారు. ఏ సినిమా అయినా జనవరి నుంచి కానీ ప్రారంభం కావు. వచ్చే ఏడాది చేసే రెండు సినిమాలు ఇవే అవుతాయి. ఆ తరువాతే మరో సినిమా.