వారు బాగుపడితే చంద్రబాబు ఓర్చుకోలేరా?

తన జన్మదినం నాడు చంద్రబాబునాయుడు.. ప్రజల మనసుల్లో అనుమానపు విషబీజాలు నాటేందుకు ఒక పెద్ద ప్రయత్నం చేశారు. రేషన్ బియ్యం పొందే లబ్ధిదారులు ఆ బియ్యం వద్దని అనుకుంటే గనుక.. వారికి కిలోకు రూ.12…

తన జన్మదినం నాడు చంద్రబాబునాయుడు.. ప్రజల మనసుల్లో అనుమానపు విషబీజాలు నాటేందుకు ఒక పెద్ద ప్రయత్నం చేశారు. రేషన్ బియ్యం పొందే లబ్ధిదారులు ఆ బియ్యం వద్దని అనుకుంటే గనుక.. వారికి కిలోకు రూ.12 వంతున చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్న నేపథ్యంలో.. అలా డబ్బులు తీసుకుంటే గనుక.. అసలు మీ రేషన్ కార్డునే రద్దు చేస్తారంటూ చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. తద్వారా ప్రభుత్వ పథకం వీగిపోవడానికి ఆయన కొత్త ఎత్తుగడ వేశారు.

ప్రభుత్వం ప్రజలకు రేషన్ ద్వారా బియ్యం సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో ఏ కుటుంబమూ కూడా.. ఆకలితో అలమటించే పరిస్థితి రానివ్వని అద్భుతమైన పథకం ఇది. ఈ పథకం ఈ ప్రభుత్వమే ప్రారంభించినది కాదు.. ఎంతోకాలం కిందటే పుట్టింది. కాకపోతే.. జగన్ ప్రభుత్వం అలా బియ్యం అందించడాన్ని కూడా.. అద్భుతమైన రీతిలో నిర్వహిస్తోంది. మధ్యలో దళారీలు ఎవ్వరూ కాజేసే అవకాశం లేకుండా.. ఇళ్లవద్దకే సరఫరా చేస్తోంది. 

అయితే కొందరు మాత్రం ఈ బియ్యం సొంతానికి వాడుకోకుండా.. కిలో పదిరూపాయల వంతున ఇతరులకు అమ్ముకుంటున్నారనే సంగతి కూడా ప్రచారంలో ఉంది. ప్రభుత్వం ఇచ్చే బియ్యం చాలని వాళ్లు బహుశా అలా కొనుక్కుంటూ ఉండవచ్చు కూడా. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకుంటున్నట్టుగా, బియ్యం అవసరం లేని వారికి కిలోకు రూ.12 వంతున చెల్లిస్తాం అని ప్రకటించింది. ఈ రోజుల్లో మారుతున్న పరిస్థితుల్లో బియ్యం మాత్రమే కాకుండా, దానికంటె ఎక్కువ గోధుమ, ఇతర ఆహారాల మీద ఆధారపడే వారి శాతం పెరుగుతోంది. 

ఆరోగ్య కారణాల రీత్యా ఇలా చేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన పథకం అలాంటివారికి లాభదాయకం. ఏ కారణం చేతనైనా బియ్యం వద్దనుకుంటున్న వారు.. అమ్ముకుంటే, వారికి దక్కే 10 రూపాయలకంటె ప్రభుత్వం ఇచ్చే 12 రూపాయలు ఎక్కువ. అలా ప్రజల చేతికి డబ్బులు వస్తాయి. అన్నిటినీ మించి.. వారికి ఎంచుకునే అధికారం ఉంటుంది. 

అలాంటి పరిస్థితిని చంద్రబాబు సహించలేకపోతున్నారు. ప్రజల చేతికి డబ్బు రావడం, వారు ఆర్థికంగా స్థిరంగా ఉండడం ఆయన ఓర్వలేకపోతున్నారు. అందుకే.. వారిలో కొత్త భయాలు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు తీసుకుంటే రేషన్ కార్డే రద్దవుతుందని భయపెడుతున్నారు. ఇందులో ఆయనకు బహుశా ఇంకో కుట్ర కోణం ఉండొచ్చు. 

ప్రభుత్వం ప్రజలకు బియ్యం వద్దంటే 12 రూపాయలు మాత్రమే ఇస్తానని అనవచ్చు గానీ.. ఆ బియ్యం కొనడానికి ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తం ఎక్కువే! డబ్బు పంచేస్తే ప్రభుత్వానికి కొంత సొమ్ము మిగులుతుంది. ఆ రకంగా ప్రజలకు డబ్బు ఇవ్వడంతో పాటు, ప్రభుత్వ ఖజానాకు చాలా మిగులుతుంది. అలా ప్రభుత్వం ఆర్థికంగా బలపడడం కూడా చంద్రబాబు అస్సలు సహించలేని విషయాల్లో ఒకటి. అందుకే ఆయన ఇలాంటి అనవసరపు భయాలను ప్రజల్లో చొప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

16 Replies to “వారు బాగుపడితే చంద్రబాబు ఓర్చుకోలేరా?”

  1. మైండ్ వుండే రాస్తున్నావా ఇటువాంటి రాతలు. అసలు రేషన్ బియ్యం అక్కరలేని వారికీ రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డ్స్ ఉండటం వల్ల, వాళ్ళకి సరిపడా, రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మిల్లెర్స్ దగ్గర ఎక్కువ రేట్ పెట్టి కొని, రేషన్ షాప్స్ కి సరఫరా చెయ్యాలి. ప్రజలకు అవసరం లేని బియ్యాన్ని టాక్స్ డబ్బులతో కొని మల్లి వాళ్ళు వద్దంటే డబ్బులివ్వటమేంటి, దీనివల్ల ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఏమైనా తగ్గుద్దా? దీనికన్నా, రేషన్ కార్డు వున్నవాళ్లు మాకు బియ్యం వద్దు, అని ఏమేమి కావాలో ముందుగా చెప్పి దాన్ని కంప్యూటరైజ్ చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుద్ది. ఆలా అని మొత్తానికి రేషన్ కార్డు లు తీసెయ్యటం తప్పే, ఎందుకంటే దాని అవసరాలు చాల ఉంటాయి. ఈ మొత్తాన్ని కంప్యూటరైజ్ చేసి ప్రక్షాళించాల్సిన అవసరం వుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి ప్రాజెక్ట్ గ ఇవ్వండి. వాళ్ళకి, ప్రభుత్వానికి కూడా ఉపయోగం గ ఉంటుంది.

  2. మై0డ్ వుండే రా/స్తు/న్నా/వా ఇటువాంటి రా/ త/లు. అసలు రేషన్ బియ్యం అక్కరలేని వారికీ రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డ్స్ ఉండటం వల్ల, వాళ్ళకి సరిపడా, రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మిల్లెర్స్ దగ్గర ఎక్కువ రేట్ పె/ ట్టి కొని, రేషన్ షాప్స్ కి సరఫరా చెయ్యాలి. ప్రజలకు అవసరం లేని బియ్యాన్ని టాక్స్ డబ్బులతో కొని మల్లి వాళ్ళు వద్దంటే డబ్బులివ్వటమేంటి, దీనివల్ల ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఏమైనా త/గ్గు/ ద్దా? దీనికన్నా, రేషన్ కార్డు వున్నవాళ్లు మాకు బియ్యం వద్దు, అని ఏమేమి కావాలో ముందుగా చెప్పి దాన్ని కంప్యూటరైజ్ చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు త/గ్గు/ ద్ది. ఆలా అని మొత్తానికి రేషన్ కార్డు లు తీసెయ్యటం తప్పే, ఎందుకంటే దాని అవసరాలు చాల ఉంటాయి. ఈ మొత్తాన్ని కంప్యూటరైజ్ చేసి ప్రక్షాళించాల్సిన అవసరం వుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి ప్రాజెక్ట్ గ ఇవ్వండి. వాళ్ళకి, ప్రభుత్వానికి కూడా ఉపయోగం గ ఉంటుంది.

  3. మై0డ్ వుండే రా/స్తు/న్నా/వా ఇటువంటి రా/ త/లు. అసలు రేషన్ బియ్యం అక్కరలేని వారికీ రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డ్స్ ఉండటం వల్ల, వాళ్ళకి సరిపడా, రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మిల్లెర్స్ దగ్గర ఎక్కువ రేట్ పె/ ట్టి కొని, రేషన్ షాప్స్ కి సరఫరా చెయ్యాలి. ప్రజలకు అవసరం లేని బియ్యాన్ని టాక్స్ డబ్బులతో కొని మల్లి వాళ్ళు వద్దంటే డబ్బులివ్వటమేంటి, దీనివల్ల ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఏమైనా త/గ్గు/ ద్దా? దీనికన్నా, రేషన్ కార్డు వున్నవాళ్లు మాకు బియ్యం వద్దు, అని ఏమేమి కావాలో ముందుగా చెప్పి దాన్ని కంప్యూటరైజ్ చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు త/గ్గు/ ద్ది.

  4. అసలు రేషన్ బియ్యం అక్కరలేని వారికీ రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డ్స్ ఉండటం వల్ల, వాళ్ళకి సరిపడా, రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మిల్లెర్స్ దగ్గర ఎక్కువ రేట్ పె/ ట్టి కొని, రేషన్ షాప్స్ కి సరఫరా చెయ్యాలి. ప్రజలకు అవసరం లేని బియ్యాన్ని టాక్స్ డబ్బులతో కొని మల్లి వాళ్ళు వద్దంటే డబ్బులివ్వటమేంటి, దీనివల్ల ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఏమైనా త/గ్గు/ ద్దా? దీనికన్నా, రేషన్ కార్డు వున్నవాళ్లు మాకు బియ్యం వద్దు, అని ఏమేమి కావాలో ముందుగా చెప్పి దాన్ని కంప్యూటరైజ్ చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు త/గ్గు/ ద్ది. ఆలా అని మొత్తానికి రేషన్ కార్డు లు తీసెయ్యటం తప్పే, ఎందుకంటే దాని అవసరాలు చాల ఉంటాయి. ఈ మొత్తాన్ని కంప్యూటరైజ్ చేసి ప్రక్షాళించాల్సిన అవసరం వుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి ప్రాజెక్ట్ గ ఇవ్వండి. వాళ్ళకి, ప్రభుత్వానికి కూడా ఉపయోగం గ ఉంటుంది.

  5. అసలు రేషన్ బియ్యం అక్కరలేని వారికీ రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డ్స్ ఉండటం వల్ల, వాళ్ళకి సరిపడా, రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మిల్లెర్స్ దగ్గర ఎక్కువ రేట్ పె/ ట్టి కొని, రేషన్ షాప్స్ కి సరఫరా చెయ్యాలి. ప్రజలకు అవసరం లేని బియ్యాన్ని టాక్స్ డబ్బులతో కొని మల్లి వాళ్ళు వద్దంటే డబ్బులివ్వటమేంటి, దీనివల్ల ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఏమైనా త/గ్గు/ ద్దా? దీనికన్నా, రేషన్ కార్డు వున్నవాళ్లు మాకు బియ్యం వద్దు, అని ఏమేమి కావాలో ముందుగా చెప్పి దాన్ని కంప్యూటరైజ్ చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు త/గ్గు/ ద్ది. ఆలా అని మొత్తానికి రేషన్ కార్డు లు తీసెయ్యటం తప్పే, ఎందుకంటే దాని అవసరాలు చాల ఉంటాయి

  6. అసలు రేషన్ బియ్యం అక్కరలేని వారికీ రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డ్స్ ఉండటం వల్ల, వాళ్ళకి సరిపడా, రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మిల్లెర్స్ దగ్గర ఎక్కువ రేట్ పె/ ట్టి కొని, రేషన్ షాప్స్ కి సరఫరా చెయ్యాలి. ప్రజలకు అవసరం లేని బియ్యాన్ని టాక్స్ డబ్బులతో కొని మల్లి వాళ్ళు వద్దంటే డబ్బులివ్వటమేంటి, దీనివల్ల ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఏమైనా త/గ్గు/ ద్దా?

  7. మై/0డ్ వుండే రా/ స్తు/న్నా/వా ఇటువంటి రా/ త/లు. అసలు రేషన్ బియ్యం అక్కరలేని వారికీ రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డ్స్ ఉండటం వల్ల, వాళ్ళకి సరిపడా, రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మిల్లెర్స్ దగ్గర ఎక్కువ రేట్ తో కొని, రేషన్ షాప్స్ కి సరఫరా చెయ్యాలి. ప్రజలకు అవసరం లేని బియ్యాన్ని టాక్స్ డబ్బులతో కొని మల్లి వాళ్ళు వద్దంటే డబ్బులివ్వటమేంటి, దీనివల్ల ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఏమైనా త/గ్గు/ ద్దా? దీనికన్నా, రేషన్ కార్డు వున్నవాళ్లు మాకు బియ్యం వద్దు, అని ఏమేమి కావాలో ముందుగా చెప్పి దాన్ని కంప్యూటరైజ్ చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు త/గ్గు/ ద్ది. ఆలా అని మొత్తానికి రేషన్ కార్డు లు తీసెయ్యటం తప్పే, ఎందుకంటే దాని అవసరాలు చాల ఉంటాయి. ఈ మొత్తాన్ని కంప్యూటరైజ్ చేసి ప్రక్షాళించాల్సిన అవసరం వుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి ప్రాజెక్ట్ గ ఇవ్వండి. వాళ్ళకి, ప్రభుత్వానికి కూడా ఉపయోగం గ ఉంటుంది.

  8. రేషన్ కార్డ్స్ ఉండటం వల్ల, వాళ్ళకి సరిపడా, రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మిల్లెర్స్ దగ్గర ఎక్కువ రేట్ తో కొని, రేషన్ షాప్స్ కి సరఫరా చెయ్యాలి. ప్రజలకు అవసరం లేని బియ్యాన్ని టాక్స్ డబ్బులతో కొని మల్లి వాళ్ళు వద్దంటే డబ్బులివ్వటమేంటి, దీనివల్ల ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఏమైనా త/గ్గు/ ద్దా? దీనికన్నా, రేషన్ కార్డు వున్నవాళ్లు మాకు బియ్యం వద్దు, అని ఏమేమి కావాలో ముందుగా చెప్పి దాన్ని కంప్యూటరైజ్ చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు త/గ్గు/ ద్ది. ఆలా అని మొత్తానికి రేషన్ కార్డు లు తీసెయ్యటం తప్పే, ఎందుకంటే దాని అవసరాలు చాల ఉంటాయి. ఈ మొత్తాన్ని కంప్యూటరైజ్ చేసి ప్రక్షాళించాల్సిన అవసరం వుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి ప్రాజెక్ట్ గ ఇవ్వండి. వాళ్ళకి, ప్రభుత్వానికి కూడా ఉపయోగం గ ఉంటుంది.

  9. రేషన్ కార్డు వున్నవాళ్లు మాకు బియ్యం వద్దు, అని ఏమేమి కావాలో ముందుగా చెప్పి దాన్ని కంప్యూటరైజ్ చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు త/గ్గు/ ద్ది. ఆలా అని మొత్తానికి రేషన్ కార్డు లు తీసెయ్యటం తప్పే, ఎందుకంటే దాని అవసరాలు చాల ఉంటాయి. ఈ మొత్తాన్ని కంప్యూటరైజ్ చేసి ప్రక్షాళించాల్సిన అవసరం వుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి ప్రాజెక్ట్ గ ఇవ్వండి. వాళ్ళకి, ప్రభుత్వానికి కూడా ఉపయోగం గ ఉంటుంది.

  10. గ్రేట్ ఆంధ్ర అని పేరు పెట్టుకుని కామెంట్స్ అన్నిటినీ మోడరేట్ చేస్తున్న పి రి కి నా —

    జ. గ్గ. డు అంటేనే రావట్లేదు.. ఎంత వయ్ చీపి సపోర్టో అర్థమౌతుంది

Comments are closed.