రెండు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ పై ప్రభావం

ఆంధ్ర ఎన్నికలు ముగిసాయి. మరో పదిహేను రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి వచ్చే ఫలితాలు రెండు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు ఆ రంగంలోని జనాలు. Advertisement ప్రస్తుతం…

ఆంధ్ర ఎన్నికలు ముగిసాయి. మరో పదిహేను రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి వచ్చే ఫలితాలు రెండు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు ఆ రంగంలోని జనాలు.

ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కాస్త మందకొడిగా వుంది. రేట్లు బాగా పెరిగిపోవడం, ఐటి రంగంలో స్లంప్ నడుస్తుండడంతో హైదరాబాద్ మార్కెట్ స్లోగా వుంది. ఇలాంటి టైమ్ లో ఆంధ్రలో ఏ ప్రభుత్వం వస్తే ఎలా వుంటుంది అన్న లెక్కలు కట్టడం ప్రారంభమైంది.

చంద్రబాబు ప్రభుత్వం వస్తే కచ్చితంగా మళ్లీ అమరావతి మీద ఫోకస్ పెడతారు. అయిదేళ్ల క్రితం వున్న రేట్లు అమాతం పడిపోయాయి. ఇప్పుడు మళ్లీ అవి పైకి లేవడం మొదలు కావచ్చు. అలా మొదలు కావడానికి కావాల్సిన చమక్కలు చేస్తారు. వార్తలు వండి వార్పిస్తారు. అదంతా ఓ స్కీము. అప్పుడు ఆంధ్ర జనాల పెట్టుబడులు సహజంగా అమరావతి వైపు మళ్లుతాయి.

అలా కాకుండా జగన్ వస్తే వేరుగా వుంటుంది. జగన్ సిఎమ్ కావడం అంటూ జరిగితే ఈసారి విశాఖను రాజధాని చేయకుండా వదలరు.ప్రమాణ స్వీకారమే విశాఖలో చేస్తా అని ప్రకటించారు ఇప్పటికే. అందువల్ల ఇక అమరావతి వైపు పెట్టుబడులు వెళ్లకుండా హైదరాబాద్ వైపే వస్తాయి.

విశాఖ కనుక రాజధాని అయితే హైదరాబాద్ లోనే పెద్ద రియల్ ఎస్టేట్ సంస్ధలు అక్కడ వెంచర్లు చేయాలని చూస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రెడీ అవుతోంది కనుక ఇప్పటి నుంచి ఆ దిశగా ప్లాన్ లు వేస్తున్నాయి. కానీ అది జగన్ వస్తేనే తప్ప వర్కవుట్ అవ్వదు.

చంద్రబాబు వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఇబ్బంది అని, జగన్ వస్తే ఇక్కడ బాగుంటుందని లెక్కలు కడుతున్నారు. మొత్తం మీద ఆంధ్ర ఎన్నికల ఫలితాల కోసం రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.