బాబు కూడా విశాఖలోనే?

ఏపీలో ఎవరు గెలుస్తారు అన్నది ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది. వైసీపీ గెలిస్తే జగన్ మరోసారి సీఎం అవుతారు. టీడీపీ కూటమి అధికారం చేపడితే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు అన్న క్లారిటీ ఉంది. ఈ…

ఏపీలో ఎవరు గెలుస్తారు అన్నది ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది. వైసీపీ గెలిస్తే జగన్ మరోసారి సీఎం అవుతారు. టీడీపీ కూటమి అధికారం చేపడితే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు అన్న క్లారిటీ ఉంది. ఈ ఇద్దరూ తప్ప మూడవ వ్యక్తి సీఎం అయ్యే ఛాన్సే లేదు. వైసీపీ ఈసారి కూడా తమదే అధికారం అని ధీమాగా ఉంది. ఆ పార్టీ అయితే జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలను చూసుకునే పనిలో ఉంది.

ఎన్నికల ఫలితాలు లాంచనమే అన్నది వైసీపీ నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. వైసీపీ బలంగా నమ్ముకున్న సెక్షన్లు అన్నీ పెద్ద ఎత్తున పోలింగ్ వేళ ఓటెత్తాయన్నది వైసీపీ విశ్లెషణ. టీడీపీ కూడా ఆ ఓట్లు అన్నీ మావే అంటోంది. తమ కోసమే మహిళకు వృద్ధులు తరలివచ్చారని చెబుతోంది. ఎవరి ఆశలు ఆలోచనలు వారివే అన్నట్లుగా ఉంది. ఓటరు మాత్రం తీర్పు ఇచ్చేశారు.

ఈవీఎంలలో అధినేతల భవిష్యత్తు ఉంది. జగన్ సీఎం అయితే విశాఖలో ప్రమాణం చేయడమే కాకుండా విశాఖ నుంచే పాలన అని చెప్పేశారు. ఒకవేళ కూటమి నెగ్గితే చంద్రబాబు సీఎం గా ఎక్కడ నుంచి ప్రమాణం చేస్తారు అన్నది అంతా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు విశాఖ నుంచి ప్రమాణం చేయాలని తెలుగు శక్తి సంస్థ కోరుతోంది. ఈ సంస్థ ప్రతినిధులు దీని మీద టీడీపీకి ఒక వినతిపత్రం సమర్పించారు.

చంద్రబాబుని విశాఖ నుంచే ప్రమాణం చేసేలా చూడాలని కోరారు. టీడీపీలో కూడా విశాఖ మీద సానుకూలత ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. స్వయంగా బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖను గ్రోత్ ఇంజన్ గా పేర్కొన్నారు. విశాఖ ను అభివృద్ధి చేసుకుంటేనే ఏపీకి భవిష్యత్తు అన్నది టీడీపీలో వినిపిస్తున్న మాట.

రేపటి రోజున కూటమి కనుక అధికారంలోకి వస్తే బాబు విశాఖ నుంచి ప్రమాణం చేస్తారా అంటే జరిగినా జరగవచ్చు అంటున్నారు. విశాఖ ఏపీలోనే మెగా సిటీ. దాంతో పాటు ఉత్తరాంధ్రలో టీడీపీ పట్టుని నిలుపుకోవడానికి టీడీపీ విశాఖ మీద స్పెషల్ ఫోకస్ తప్పకుండా పెడుతుంది అని అంటున్నారు.