జాన్వి ఎఫెక్ట్.. హాట్ హీరోయిన్ కు గ్యాప్?

హీరోయిన్ల విషయంలో ఉన్నంత పోటీ హీరోల మధ్య ఉండదు. ఓ హీరోయిన్ క్లిక్ అయిందంటే, ఇద్దరు హీరోయిన్ల కెరీర్ ఇరకాటంలో పడ్డట్టే. మిగతా పరిశ్రమల సంగతి పక్కనపెడితే, టాలీవుడ్ లో మాత్రం ఇదే కల్చర్…

హీరోయిన్ల విషయంలో ఉన్నంత పోటీ హీరోల మధ్య ఉండదు. ఓ హీరోయిన్ క్లిక్ అయిందంటే, ఇద్దరు హీరోయిన్ల కెరీర్ ఇరకాటంలో పడ్డట్టే. మిగతా పరిశ్రమల సంగతి పక్కనపెడితే, టాలీవుడ్ లో మాత్రం ఇదే కల్చర్ కొనసాగుతోంది. పైగా ఇప్పుడంతా ‘పాన్ ఇండియా’ జపం చేస్తున్నారు. దీంతో ఓ హీరోయిన్ క్లిక్ అయితే, మిగతా హీరోయిన్లకు గుండె దడ పట్టుకుంటోంది. చివరికి కియరా అద్వానీ లాంటి హీరోయిన్ కు కూడా ఈ పాట్లు తప్పడం లేదు.

బాలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది ఈ బ్యూటీకి. ఓ పెద్ద సినిమా కార్యరూపం దాలిస్తే హీరోయిన్ గా కియరా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడా స్థానాన్ని మెల్లమెల్లగా జాన్వి కపూర్ ఆక్రమిస్తోంది.

దేవర సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వి. చేస్తున్నది ఒక సినిమానే అయినప్పటికీ చర్చల్లో మాత్రం చాలా సినిమాల్ని పెండింగ్ లో పెట్టింది. ఇందులో భాగంగా రామ్ చరణ్ తో సినిమాను లాక్ చేసింది. త్వరలోనే మరో పెద్ద సినిమాను ప్రకటించబోతోంది.

జాన్వి రాకతో కియరా అద్వానీ తన కెరీర్ ప్లాన్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ఏటా హిందీ, తెలుగు భాషల్లో చెరో సినిమా చేయాలనేది ఈమె ప్లాన్. కాని జాన్వి రాకతో పెద్ద సినిమాలు కియరా చేజారిపోతున్నాయి.

దీంతో టాలీవుడ్ లో చిన్న గ్యాప్ తీసుకోవాలని భావిస్తోంది కియరా. ఈ గ్యాప్ లో ఓ హిందీ సినిమా లేదా తమిళ సినిమాకు కాల్షీట్లు ఇవ్వాలనుకుంటోంది.