ప్రాజెక్ట్ కె.. రెండు భాగాలే

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ ప్రాజెక్ట్ కె రెండు భాగాలుగా వస్తుందని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. కాదు.. ఫ్రాంచైజీ గా వుంటుంది. భాగాలు కాదు అని అప్పట్లో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. కానీ…

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ ప్రాజెక్ట్ కె రెండు భాగాలుగా వస్తుందని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. కాదు.. ఫ్రాంచైజీ గా వుంటుంది. భాగాలు కాదు అని అప్పట్లో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీ కాదు రెండు భాగాలుగానే చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. 

రోజు రోజుకూ పెరిగిపోతున్న బడ్జెట్, స్పాన్ పెరిగిపోతుండడంతో ప్లాన్ లు మార్చుకోక తప్పడం లేదు. అందుకోసమే అన్ని భాషల నటులను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే వీళ్లంతా తొలిభాగంలో జస్ట్ పరిచయం మాత్రమే వుంటుందని, మలిసగం సినిమాకు లీడ్ గా వుంటారని తెలుస్తోంది.

ముఖ్యంగా విశ్వనటుడు కమల్ హాసన్ సినిమా చివరి అరగంటలో వచ్చి, ద్వితీయ భాగం అంతా కమల్ మీద వుంటుందనే ఫీల్ తో సినిమాను ముగిసేలా చేస్తారని టాక్ వినిపిస్తోంది. సినిమా 500 కోట్లలో అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు 800 కోట్ల మేరకు బడ్జెట్ లెక్కలు వస్తున్నాయని, అందువల్ల రెండు భాగాలు అయితేనే కిడుతుందని భావిస్తున్నారట. హాలీవుడ్ స్టూడియోను భాగస్వాములను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మొత్తం మీద ఇక టాలీవుడ్ లో ఏ భారీ సినిమా తీసినా, బడ్జెట్ పెట్టుబడులు, లాభాల లెక్కల దృష్ట్యా రెండు భాగాలు అన్నది కామన్ అయిపోతుందేమో? బాహుబలి, పుష్ప, సలార్ బాటలో అన్ని సినిమాలు నడుస్తాయేమో?