తూర్పు అభివృద్ధి పవన్ కు తెలుసా?

తూర్పు గోదావరిలో కూలీల దినసరి రేట్లు ఎలా వున్నాయో పవన్ కు తెలుసా? Advertisement మిగిలిన ప్రాంతాల కన్నా తూర్పు గోదావరిలో కూలీల రేట్లు ఎక్కువ అని తెలుసా? ఉత్తరాంధ్ర నుంచి కూలీలను తూర్పు…

తూర్పు గోదావరిలో కూలీల దినసరి రేట్లు ఎలా వున్నాయో పవన్ కు తెలుసా?

మిగిలిన ప్రాంతాల కన్నా తూర్పు గోదావరిలో కూలీల రేట్లు ఎక్కువ అని తెలుసా?

ఉత్తరాంధ్ర నుంచి కూలీలను తూర్పు గోదావరికి దిగుమతి చేసుకుంటారని తెలుసా?

తుని దగ్గర నుంచి రాజమండ్రి వరకు జిల్లా పారిశ్రామికంగా ఎంత ముందుకు వెళ్తోందో తెలుసా?

హైదరాబాద్ కన్నా కాకినాడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని పవన్‌కు తెలుసా?

కాకినాడలో కన్నా హైదరాబాద్‌లో అద్దెలు, కొనుగోళ్ల ధరలు ఎక్కువ అని తెలుసా?

కోనసీమలో ఎకరా పొలం ఎంత రేటు వుంటుందో ఐడియా వుందా?

ఇవేమీ తెలియకుండా తూర్పుగోదావరి అభివృద్ది చెందలేదు.. అంటూ, తాను వెరైటీ హామీలు ఇస్తారేంటీ? అన్నవరం నుంచి భీమవరం వరకు పుణ్య క్షేత్రాల సర్క్యూట్ అంట. ఈస్ట్-వెస్ట్ పుణ్య క్షేత్రాలు అన్నీ ఎప్పుడో లింక్ అయి వున్నాయి భక్తుల దృష్టిలో. ఇప్పటికే శివరాత్రి వస్తే పంచారామాల యాత్రలు జరుగుతూనే వుంటాయి.

కోటిపల్లి రైల్వే లైన్ అంటున్నారు పవన్. అదేమీ కొత్తది కాదు.. దశాబ్దాల కాలంగా జరుగుతూనే వుంది. కాంగ్రెస్ పాలన చూసింది. తెలుగుదేశం పాలన కూడా చూసింది. ఇప్పుడు పవన్ కోరుకుంటున్న తెలుగుదేశం పాలన మరోసారి చూస్తుంది. మరి పవన్ అసలు ముందుగా ఈ సంగతి మాట్లాడొచ్చు కదా.

పారిశ్రామిక ప్రగతి అంటున్నారు. తుని నుంచి కాకినాడ వరకు ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. మరొక్క అయిదేళ్లు వేచి వుండండి. విశాఖ రేంజ్ కు చేరుకుంటుంది ఆ ప్రాంతం. అప్పుడు బాబు వుంటే కనుక తానే డెవలప్ చేసాను అని చెప్పుకోవచ్చు.

ఇవన్నీ వదిలేసి అసలు తూర్పుగోదావరి జిల్లా అభివృద్దే కానట్లు పవన్ మాట్లాడుతున్నారు.

పవన్ చెప్పాల్సింది. కొత్తగా ఏం చేస్తాను అని. అంతే కానీ ఇప్పటి వరకు ఏమీ కాలేదని కాదు. అలా చెప్పాల్సిన ప్రాంతాలు వేరే వున్నాయి. ఈస్ట్ గోదావరి అయితే కాదు. రెండు రాష్ట్రాల్లో ఆర్థికంగా చాలా అంటే చాలా బలమైన కాపులు ఏ జిల్లాలో వున్నారు అంటే చెప్పేది ఈస్ట్.. వెస్ట్ గురించే. అంత అభివృద్ది చెందిన ప్రాంతాలను పట్టుకుని పవన్ తెలిసీ తెలియనట్లు మాట్లాడుతున్నారు.

ఇవన్నీ సరే, అసలు హామీలు ఇవ్వాలంటే ప్రభుత్వం స్థాపించాలి. లేదా ప్రభుత్వంలో చేరాలి. పది ఇరవై సీట్లకు పోటీ చేసి ఈ రెండూ పవన్ సాధించగలరా? ఏమో?