సలార్ టీజర్ పనుల్లో ఉంటే, ఫొటోలు లీక్ చేశారు

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? కేజీఎఫ్ ఛాప్టర్-2తో పాటు వస్తుందని మొన్నటివరకు ప్రభాస్ ఫ్యాన్స్ ఊదరగొట్టారు. కానీ మే నెలాఖరుకు గానీ టీజర్ రాదు. ఓవైపు ఈ టీజర్…

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? కేజీఎఫ్ ఛాప్టర్-2తో పాటు వస్తుందని మొన్నటివరకు ప్రభాస్ ఫ్యాన్స్ ఊదరగొట్టారు. కానీ మే నెలాఖరుకు గానీ టీజర్ రాదు. ఓవైపు ఈ టీజర్ పనులు, దానిపై ప్రచారం ఇలా సాగుతుండగా.. ఉన్నట్టుండి మరోసారి లీకేజీ బారిన పడింది ఈ సినిమా.

అవును.. సలార్ నుంచి గంపగుత్తగా ఒకేసారి అరడజను స్టిల్స్ లీక్ అయ్యాయి. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఈ స్టిల్స్ వైరల్ అయ్యాయి. ఊహించని ఈ పరిణామంతో సలార్ యూనిట్ అప్రమత్తమైంది. గంటల వ్యవథిలోనే ఆ స్టిల్స్ అన్నింటినీ డిలీట్ చేసింది. ఇంతకీ ఈ స్టిల్స్ ఎలా లీక్ అయ్యాయో తెలుసా?

సలార్ టీజర్ కు ప్రచారం కల్పించేందుకు.. టీజర్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ తీసి పక్కనపెట్టారు. వన్ డే టు గో.. 2 డేస్ టు గో.. అంటూ కౌంట్ డౌన్ ఇవ్వడం కోసం వాటిని సెలక్ట్ చేసి పెట్టుకున్నారు. అలా ప్రత్యేకంగా సెలక్ట్ చేసిన స్టిల్స్ అన్నీ ఒకేసారి సోషల్ మీడియాలోకి వచ్చేశాయి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోంది సలార్ మూవీ. కేజీఎఫ్ ఛాప్టర్-2 సక్సెస్ తో సలార్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇలాంటి టైమ్ లో స్టిల్స్ లీక్ అయి, యూనిట్ ను ఇబ్బంది పెడుతోంది. మరోవైపు సలార్ స్టిల్స్ ను పోస్ట్ చేసిన వందలాది ట్విట్టర్ ఎకౌంట్లు సస్పెండ్ అయ్యాయి.