1). నేను హింసావాదిని కాదు …సౌమ్యవాదిని – ఎమ్మెల్యే బాబూరావు -ఎమోషన్స్ వల్ల ప్రమోషన్లు రావు బాబూరావు
2). ఇంత ప్రజావ్యతిరేకత చరిత్రలో ఎప్పుడూ చూడలేదు -చంద్రబాబు -2019లో కూడానా?
3). వైసీపీ అభిమాని సందేహం -ఇన్‌చార్జ్‌ల వల్ల , పార్టీ రీచార్జ్ అవుతుందా?
4). అధికారంలోకి వస్తే ఎవరినీ విడిచిపెట్టేది లేదు – అచ్చెన్నాయుడు -అచ్చేదిన్ వస్తాయా అచ్చన్నా?
5). హీరోగా అమితాబ్ మనుమడు -సినిమాల్లో నవరసాలు పోయి వారసం మిగిలేలా ఉంది
6). టీ కొట్టు వ్యాఖ్య -కౌలు రైతుల గురించి పవన్ – పవన్ కూడా రాజకీయాల్లో చేస్తున్నది కౌలు సేద్యమే
7). పదవి ఇవ్వకున్నా జగన్ కాళ్లకి మొక్కేవాడిని – మంత్రి నారాయణస్వామి -ఆయన కాళ్లు , మీ చేతులు … మధ్యలో మాకేంటి?
8). టీడీపీకి కడుపు మంటః మంత్రి అమర్‌నాథ్ -చాలా కాలంగా “మేత” లేదు కదా!
9). ఏపీలో శ్రీలంక పరిస్థితులుః గోరంట్ల బుచ్చయ్యచౌదరి -ఏపీ ఒక రాష్ట్రం, శ్రీలంక ఒక దేశం, కనీసం ఆ క్లారిటీ అయినా వుందా?
10). జనావాసాల్లోకి కోతుల దండు -రాజకీయ పార్టీల్లో చేరడానికేమో!
-జీఆర్ మహర్షి